Samantha : సమంతలో అది నాకు చాలా ఇష్టం.. అందుకే పెళ్లి చేసుకున్నాః నాగచైతన్య

Samantha : సమంతకు నాకు విడాకులు అయి రెండేండ్లు కావొస్తోంది. కానీ ఇంకా ఈ విషయం గురించి ఎందుకు సాగదీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య..

By: jyothi

Updated On - Tue - 9 May 23

Samantha : సమంతలో అది నాకు చాలా ఇష్టం.. అందుకే పెళ్లి చేసుకున్నాః నాగచైతన్య

Samantha : సమంత, చైతూ విడిపోయి ఇప్పటికే రెండేండ్ల కావస్తోంది. కానీ ఇంకా వీరిద్దరి విడాకుల విషయం గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. వీరిద్దరూ ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికీ ఒక సస్పెన్స్ అనే చెప్పుకోవాలి. సమంత ఈ విషయాలపై చాలా సీరియస్ అవుతూనే ఉంది.

కానీ నాగచైతన్య మాత్రం చాలా కూల్ గానే స్పందిస్తున్నారు. సమంత విషయంలో ఆయన ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటున్నాడు. ఇక తాజాగా ఆయన నటించిన కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో ఎప్పటికప్పుడు సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఇందులో ఆయన మాట్లాడుతూ.. సమంతకు నాకు విడాకులు అయి రెండేండ్లు కావొస్తోంది. కానీ ఇంకా ఈ విషయం గురించి ఎందుకు సాగదీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య. అనంతరం యాంకర్ మరో ప్రశ్న వేసింది. మీతో నటించిన హీరోయిన్లలో మీకు ఏం నచ్చుతుంది అని అడిగింది.

దానికి చైతూ స్పందిస్తూ.. నాతో నటించిన వారిలో సమంతలో నాకు హార్డ్ వర్కింట్ అంటే చాలా ఇష్టం. వర్క్ పట్ల ఆమెకు ఉన్న డెడికేషన్ నాకు నచ్చతుంది. అందుకే పెళ్లి చేసుకున్నా. కృతిశెట్టిలో ఇన్నోసెన్స్ చాలా ఇష్టం. పూజాహెగ్డేలో స్టైల్ నాకు నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చాడు చైతూ.

 

Read Also : Rashmika Mandanna : అలాంటి వాడే మొగుడిగా రావాలి.. రష్మిక అతని గురించి ఓపెన్ అయిందిగా..!

Read Also : Tamannaah Bhatia : తమన్నా పెండ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News