Naga Chaitanya: ఆ రోజులు మర్చిపోలేను.. గుణపాఠాలు నేర్చుకున్నా: నాగచైతన్య

Naga Chaitanya: అక్కినేని నటవారసుడు నాగచైతన్య ప్రస్తుతం చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. ఆయన నటించిన సినిమాలు క్రమంగా ప్లాప్ అవుతున్నాయి..

By: jyothi

Published Date - Sat - 24 September 22

Naga Chaitanya: ఆ రోజులు మర్చిపోలేను.. గుణపాఠాలు నేర్చుకున్నా: నాగచైతన్య

Naga Chaitanya: అక్కినేని నటవారసుడు నాగచైతన్య ప్రస్తుతం చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. ఆయన నటించిన సినిమాలు క్రమంగా ప్లాప్ అవుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన థాంక్యూ మూవీ డిజాస్టర్ అవ్వగా..లాల్ సింగ్ చద్దా మూవీ కూడా అదే రీతిలో నిరాశ పరిచింది. ఇందులో చైతూ ఓ కీలక పాత్ర పోషించాడు. బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా ట్రోలింగ్ దెబ్బకు ఆ సినిమా దారుణమైన పరాభావాన్ని చవిచూసింది. చైతూకు చివరి హిట్ అంటే లవ్ స్టోరీ మాత్రమే.

లవ్ స్టోరీకి ఏడాది.. చైతూ కామెంట్స్

నాగచైతన్య గత కొంతకాలంగా కథల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకోవడం లేదని ఇట్టే అర్థం అవుతోంది. తన భార్య సమంతతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి చైతూ అందిరికీ దూరంగా ఉంటున్నాడట..కేవలం షూటింగ్స్ మాత్రమే వెళ్తున్నాడట..ఎక్కడకు వెళ్లడం లేదని.. ఎవరినీ కలువడం లేదని వార్తలు వస్తున్నాయి. కేవలం సినిమాలపై మాత్రమే ఫోకస్ పెట్టాడట. కానీ కథల విషయంలో ఎదురుదెబ్బలు తింటున్నాడు చైతూ..

నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించగా.. అగ్రవర్ణ కులాలు, చిన్నకులాల మధ్య గల అంతరాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించాడు శేఖర్ కమ్ముల. ఇక ఆన్ స్క్రీన్ పై చైతూ, సాయి పల్లవి కెమిస్ట్రీ బాగుందని చాలా మంది కితాబిచ్చారు.

ఇక థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు నిరాశ పరచడంతో మౌనంగా ఉన్న చైతూ.. లవ్ స్టోరీ విడుదలై ఏడాది అయిన సందర్భంగా సోషల్ మీడియాలో తన భావాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇంతటి విజయం అందించిన ప్రేక్షకులకు, సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ. ఈ సినిమా నాకు ఎన్నో పాఠాలు నేర్పిడమే కాకుండాఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలను అందించినదని చైతూ ట్వీట్ చేశాడు.

Read Also : Vishnu Priya : బాబోయ్ విష్ణుప్రియ అందాలు చూడ‌లేం.. వాటిని తెలివిగా చూపిస్తోంది..!

Read Also : Ramyakrishnan : ర‌మ్య‌కృష్ణ ఎద ప‌రువాల‌పై ఘాటు కామెంట్లు చేసిన డైరెక్ట‌ర్.. అంత మాట అనేశాడేంటి..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News