నాగబాబు అరేఓ సాంబ కాస్త చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్‌’ అయ్యింది

  సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరో హీరోకు వెళ్లడం చాలా కామన్‌ గా జరుగుతూ ఉంటాయి. ఒక హీరోకు అనుకున్న కథ ఆయనకు నచ్చక పోవడం లేదంటే ఆయనతో ఆ కథను చేస్తే వర్కౌట్ అయ్యే అవకాశం లేదని అనుకోవడం లేదా బడ్జెట్ ఇష్యూల కారణంగా సినిమాలు చేతులు మారుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించాల్సిన పలు సినిమా లు రవితేజ చేశాడని… పవన్‌ వదిలేసిన సినిమాలు చేయడం వల్లే రవితేజ […].

By: jyothi

Published Date - Wed - 26 May 21

నాగబాబు అరేఓ సాంబ కాస్త చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్‌’ అయ్యింది

 

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరో హీరోకు వెళ్లడం చాలా కామన్‌ గా జరుగుతూ ఉంటాయి. ఒక హీరోకు అనుకున్న కథ ఆయనకు నచ్చక పోవడం లేదంటే ఆయనతో ఆ కథను చేస్తే వర్కౌట్ అయ్యే అవకాశం లేదని అనుకోవడం లేదా బడ్జెట్ ఇష్యూల కారణంగా సినిమాలు చేతులు మారుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించాల్సిన పలు సినిమా లు రవితేజ చేశాడని… పవన్‌ వదిలేసిన సినిమాలు చేయడం వల్లే రవితేజ టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు దక్కించుకున్నాడనే టాక్‌ వినిపిస్తూ ఉంటుంది. సినిమాలు చేతులు మారడం ఈమద్య కాలంలో మాత్రమే కాకుండా కొన్ని పదుల సంవత్సరాల నుండే కొనసాగుతూ వస్తోంది.
మెగాస్టార్‌ చిరంజీవి మొదలు ఎంతో మంది సీనియర్‌ హీరోలు కూడా ఇతర హీరోలు వదిలేసిన లేదా చేయలేక పోయిన కథలను చేసి సూపర్‌ హిట్‌ లను దక్కించుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ చిత్రాల్లో ఒకటి అయిన గ్యాంగ్‌ లీడర్‌ కూడా అలా చేసిందే అనే విషయం మీకు తెలుసా. గ్యాంగ్‌ లీడర్ కథ ను చిరంజీవి ఎవరో బయట హీరో నుండి కాకుండా స్వయంగా తన తమ్ముడు నాగబాబు నుండి తీసుకున్నాడు. నాగబాబు చేయాల్సిన సినిమా నే చిరంజీవి గ్యాంగ్‌ లీడర్ గా చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ వివరాల్లోకి వెళ్లి అసలు విషయం ఏంటో చూద్దాం రండీ…
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అప్పుడప్పుడే ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా నెంబర్ 1 హీరోగా నిలదొక్కకుంటున్న సమయంలో తన పెద్ద తమ్ముడు అయిన నాగబాబును కూడా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. నాగబాబు మొదట చిరంజీవి నటించిన కొన్ని సినిమాల్లో నటించాడు. నాగబాబుకు నటుడిగా మంచి భవిష్యత్తు ఉందనే ఉద్దేశ్యంతో కొందరు రచయితలు మరియు దర్శకులు ఆయన హీరోగా సినిమాలను చేసేందుకు కథలు సిద్దం చేసుకున్నారు.
కొండవీటి దొంగ సినిమాలో నాగబాబు నటనను చూసిన పరుచూరి బ్రదర్స్‌ ఫిదా అయ్యి… నాగబాబు హీరోగా అరేఓ సాంబ అనే టైటిల్ తో ఒక పవర్ ఫుల్‌ స్క్రిప్ట్‌ ను దర్శకుడు విజయ బాపినీడుతో కలిసి రెడీ చేశారు. ఆ కథను నాగబాబుతో తెరకెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని నిర్మాత వేటలో పడ్డారు. కొత్త హీరో అయిన నాగబాబు తో అంతటి భారీ సినిమాను చేసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు.
ఆ కథను కాంప్రమైజ్ అయ్యి చేస్తే బాగోదనే ఉద్దేశ్యంతో నాగబాబు తన కంటే తన అన్న
చిరంజీవికి అయితే ఈ కథ బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేశాడు. అలా దర్శకుడు విజయ బాపినీడు చిరంజీవిని కలిశాడు. అరేఓ సాంబ కథను చిరంజీవికి చెప్పగా కొన్ని మార్పులు చెప్పడంతో పాటు టైటిల్‌ ను కూడా మార్చాల్సిందిగా సూచించాడు. పరుచూరి బ్రదర్స్ మరియు విజయ బాపినీడు కలిసి నాగబాబు కోసం తయారు చేసిన అరేఓ సాంబ కథను చిరంజీవి కోసం గ్యాంగ్ లీడర్‌ గా మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా తీర్చి దిద్దారు.
1991 లో విడుదల అయిన గ్యాంగ్ లీడర్ అప్పటికి ఇప్పటికి ఒక ఆణిముత్యంగా నిలిచి పోయింది. 1991 లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమా ను ఇప్పటికి రీమేక్ చేసేందుకు పలువురు మేకర్స్ ఆసక్తిగా ఉన్నారంటే ఆ సినిమా ఏ రేంజ్ సక్సెస్‌ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. నాగబాబు ఆ సమయంలో కాంప్రమైజ్‌ అయ్యి తక్కువ బడ్జెట్‌ తో అరేఓ సాంబగా ఈ కథను చేసి ఉంటే ఒక సూపర్‌ డూపర్‌ ఇండస్ట్రీ హిట్‌ ను టాలీవుడ్‌ మిస్‌ అయ్యేది అలాగే చిరంజీవి కూడా కెరీర్ లో ఒక బిగ్గెస్ట్‌ మాస్ మసాలా మూవీని కోల్పోయేవాడు. నాగబాబు తీసుకున్న ఆ నిర్ణయంను నిజంగా అభినందించాల్సిందే.

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News