Nagma : అప్పట్లో నగ్మా అంటే ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది ఈ భామ. చిరంజీవి లాంటి లెజెండ్స్ దగ్గరి నుంచి తెలుగు, తమిళం, హిందీ లాంటి అన్ని భాషల్లో అప్పట్లో ఆమె స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేకుండా ఆమె స్టార్ హీరోయిన్ గా ఊపేసింది.
అయితే ఆమె విషయంలో తల్లిదండ్రులు మాత్రం దారుణంగా వ్యవహరించారంట. అప్పట్లో నగ్మా తండ్రి సినిమాలను నిర్మించేవారు. కానీ ఆయనకు సినిమాల ద్వారా దారుణంగా నష్టాలు వచ్చాయి. అప్పుల్లో కూరుకుపోయారు. చేసేది లేక తన కూతురును తీసుకుని డైరెక్టర్ల వద్దకు వెల్లారంట.
తన కూతురును హీరోయిన్ గా తీసుకోవాలంటూ చెప్పారంట. కానీ అప్పటికి నగ్మా వయసు కేవలం 13 ఏండ్లు మాత్రమే. హీరోయిన్ కావాల్సిన ఫిజిక్, షేపులు ఆమెకు లేవు. దాంతో ఆమెకు బలవంతంగా హార్మోన్స్ ఇంజెక్షన్లు ఇప్పించారంట. అప్పట్లో ఈ విషయం సంచలనం రేపింది.
తల్లిదండ్రుల కోరికను కాదనలేక ఆమె ఇంజెక్షన్లు చేయించుకుని అతి చిన్న వయసులోనే హీరోయిన్ లా మారిపోయింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోయిన్ గా ఎదిగి తన తండ్రి అప్పులు మొత్తం తీర్చేసింది. ఇక వ్యక్తిగతంగా ఆమె ఇంకా పెండ్లి చేసుకోలేదు. కానీ కెరీర్ లో మాత్రం చాలానే ఎఫైర్లు పెట్టుకుంది. ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉంది.