Nandamuri Balakishna : నందమూరి నటసింహం బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎన్టీఆర్‌చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన స్టార్ హీరోగా ఉన్నారు. అయితే అప్పట్లో ఆయన మీద చాలా అంచనాలు ఉండేవి. సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు బాలయ్య మీద కొన్ని రూమర్లు వచ్చాయి.
ఆయన కూడా పలానా హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఆమెనే సుహాసిని. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా మంగమ్మగారి మనవడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. అయితే ఈ మూవీని అప్పట్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెరెక్కించారు.
ఈ సినిమా షూటింగ్ అక్కడ జరుగుతోంది. అయితే ఓ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత సుహాసినికి ఖరీదైన వజ్రాల హారం గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా వారు వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కథనాలు అల్లేశారు. ఇంకేముంది మీడియాలో అప్పట్లో ఇది బాగా హాట్ టాపిక్ అయింది.
Nandamuri Balakishna Had Love Affair with Suhasini
ఈ విషయం తెలుసుకున్న కోడి రామకృష్ణ వెంటనే సదరు మీడియా రిపోర్టర్లను పిలిచి.. ఏమయ్యా.. మీకు ఏది తోస్తే అది రాసేస్తారా.. సీనియర్ ఎన్టీఆర్ కు తెలిస్తే మీ పత్రికలు లేపేస్తారు అంటూ చెప్పారంట. కానీ మీడియాలో కథనాలు మాత్రం ఆగలేదు. చివరకు ఇదంతా ఫేక్ అని తేలిపోయింది.
Read Also : Divi Vadthya : అవకాశాల కోసం పడుకుంటే తప్పేంటి.. బిగ్ బాస్ దివి సంచలన వ్యాఖ్యలు..!
Read Also : SS Rajamouli : పెండ్లికి ముందే రాజమౌళి తండ్రి అయ్యాడని మీకు తెలుసా..?