నందమూరి నటసింహం బాలయ్య ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఈ వయసులో కూడా ఆయన హుషారెత్తించే విధంగా సినిమాలు చేస్తున్నాడు. ఇక సినిమాల్లోనే కాకుండా అటు హోస్ట్ గా కూడా రాణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ స్టాపబుల్ రెండో సీజన్ లోకూడా అదరగొట్టేశారు.
అయితే ఆయన గతంలో ముద్దు సీన్ గురించి హీరోయిన్ మీనాపై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అన్ స్టాపబుల్ షోకు శర్వానంద్, అడవిశేష్ వచ్చారు. ఓ టాస్క్ లో భాగంగా ఆయన మీనాతో జరిగిన సీన్ ను వివరించారు. బొబ్బిలి సింహం సినిమాలో హీరోయిన్ గా మీనా నటించారు.
అయితే మూవీ ఓపెనింగ్ కు రజినీకాంత్, మీనా ఇద్దరూ వచ్చారు. మొదటి క్లాప్ ను రజినీకంత్ కొట్టారు. నేను సీరియస్ డైలాగ్ చెబుతాను. ఆ తర్వాత మీనా పరుగెత్తుకుంటూ వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టాలి. అయితే మీనా కాస్త లేటుగా పరుగెత్తుకుంటూ వచ్చింది. అదేంటి ఇంకా రావట్లేదు అని నేను సైడుకు తిరిగి చూశాను.
అప్పుడే ఆమె నా దగ్గరకు వచ్చింది. ఇద్దరి లిప్స్ దగ్గరకు వచ్చాయి. దాంతో ఆమె భయంతో అరిచేసింది. వెంటనే డైరెక్టర్ కట్ చెప్పేశాడు. అలా మా ఇద్దరి మధ్య లిప్ కిస్ మిస్ అయింది అంటూ సరదాగా చెప్పేశాడు బాలయ్య. ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతున్నాయి.