Nandamuri Balakrishna : విశ్వనట భారతి, లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ విజయశాంతి గురించి తెలియని తెలుగు ప్రజలు ఉండబోరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వెండితెరపై ఆమె పోషించిన పాత్రలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రజల్లో చైతన్యం నింపే చిత్రాల్లో నటించిన విజయశాంతి ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి నాయకురాలు అయ్యారు.
కమర్షియల్ మూవీస్ చేసినప్పటికీ విజయశాంతికి ఉమన్ సెంట్రిక్ మూవీస్‌తోనే ఎక్కువ పేరొచ్చింది. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్‌ను మ్యారేజ్ చేసుకుంది. ఆయన నందమూరి బాలకృష్ణకు ఏమవుతాడు.. వారిరువురి మధ్య ఎటువంటి సంబంధాలున్నాయో.. తెలుసుకుందాం..
విజయశాంతి హస్బెండ్ శ్రీనివాస్ ప్రసాద్, నందమూరి కుటుంబానికి మధ్య బలమైన చుట్టరికపు సంబంధం ఉంది. అదేంటంటే.. సీనియర్ ఎన్టీఆర్ పెద్దల్లుడు గణేశ్ రావుకు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ స్వయాన మేనల్లుడు. అంటే శ్రీనివాస్ ప్రసాద్ బాలకృష్ణకు కొడుకు అవుతాడు. అయితే, బాలకృష్ణ, శ్రీనివాస్ ప్రసాద్ మధ్య రిలేషన్ కంటే కూడా ఫ్రెండ్స్‌గానే వారు ఎక్కువగా కలిసి ఉన్నారు. ఈ దోస్తీతోనే బాలకృష్ణతో ఒక సినిమా చేయాలనుకున్నాడు శ్రీనివాస్ ప్రసాద్. అలా శ్రీనివాస్ ప్రసాద్ బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్స్ స్థాపించి కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో ‘నిప్పురవ్వ’ ఫిల్మ్‌ను తెరకెక్కించారు.
Nandamuri Balakrishna
‘నిప్పురవ్వ’ సినిమాలో హీరోయిన్‌గా మొదట పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలించినప్పటికీ చివరకు హీరోయిన్‌గా విజయశాంతి ఫైనల్ అయింది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాలని కోరేందుకు స్వయంగా శ్రీనివాస్ ప్రసాద్ విజయశాంతి వద్దకు వెళ్లడం గమనార్హం. బాలకృష్ణ, విజయశాంతి సూపర్ హిట్ జోడీగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇక ఈ సినిమా సందర్భంగా శ్రీనివాస్ ప్రసాద్, విజయశాంతి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా మెల్లగా ప్రేమగా మారింది. ఆ తర్వాత మ్యారేజ్ అయింది. బాలకృష్ణ, విజయశాంతి జోడీగా వచ్చిన సినిమాల్లో చివరిది ‘నిప్పురవ్వ’ కావడం గమనార్హం.
Nandamuri Balakrishna 2
విజయశాంతి ప్రజెంట్ పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. బీజేపీ నాయకురాలిగా ఉన్న విజయశాంతి మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే, విజయశాంతి హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ మూవీ తెలుగు భాషలో కాదట. విజయశాంతి తొలుత హీరోయిన్‌గా ‘కల్లుక్కుళ్ ఈరమ్’ అనే తమిళ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో నటిస్తున్నపుడు విజయశాంతి వయసు పదిహేనేళ్లే. ఇక తెలుగులో విజయశాంతి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ సూపర్ స్టార్ కృష్ణ ‘కిలాడీ కృష్ణుడు’. కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో గ్లామరస్ రోల్స్ ప్లే చేసిన విజయశాంతి.. ఆ తర్వాత కాలంలో తన పంథా మార్చుకుంది.