• Telugu News
  • movies

Nandamuri Balakrishna – Roja : ఇండస్ట్రీలో ఆ అరుదైన రికార్డు బాలకృష్ణ, రోజాలకే సొంతం..

Nandamuri Balakrishna- Roja: మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా నందమూరి బాలకృష్ణ పేరుగాంచిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా, ఆయన నటించిన సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తుంటారు. కాగా, టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ- రోజాల కాంబినేషన్‌లో సూపర్ హిట్ ఫిల్మ్స్ వచ్చాయి.ఈ క్రమంలోనే వారిరువురు రేర్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. అవేంటో తెలుసుకుందాం. సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో జంటగా నటించి నందమూరి బాలకృష్ణ – రోజాలు […].

By: jyothi

Published Date - Thu - 18 November 21

Nandamuri Balakrishna – Roja : ఇండస్ట్రీలో ఆ అరుదైన రికార్డు బాలకృష్ణ, రోజాలకే సొంతం..

Nandamuri Balakrishna- Roja: మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా నందమూరి బాలకృష్ణ పేరుగాంచిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా, ఆయన నటించిన సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తుంటారు. కాగా, టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ- రోజాల కాంబినేషన్‌లో సూపర్ హిట్ ఫిల్మ్స్ వచ్చాయి.ఈ క్రమంలోనే వారిరువురు రేర్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. అవేంటో తెలుసుకుందాం.

సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో జంటగా నటించి నందమూరి బాలకృష్ణ – రోజాలు రికార్డు సృష్టించారు. ఇకపోతే ఇద్దరు కూడా ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లో కి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. వీళ్లు దాదాపుగా అన్ని జోనర్స్‌లో సినిమాలు చేశారు.

నందమూరి బాలయ్య- రోజా జంటగా 1994లో సింగీతం శ్రీనివాస రావు డైరెక్షన్‌లో ‘బైరవ ద్వీపం’ సినిమాలో నటించారు. ఇది వారి తొలి స్క్రీన్ షేరింగ్ కాగా, ఈ చిత్రం తర్వాత హీరోయిన్‌ రోజాకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఆమె కెరీర్‌లో ఎన్నో మంచి పాత్రలు పోషించింది. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణతో ‘గాండీవం’ మూవీలో నటించింది రోజా. ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యపాత్ర పోషించారు. అయితే, ఈ ఫిల్మ్ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.

BHAIRAVA DWEEEPAM

BHAIRAVA DWEEEPAM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఏ.కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ‘బొబ్బిలి సింహం’ మూవీలో నందమూరి బాలయ్య-రోజా నటించారు. ఈ చిత్రంలో రోజా కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయింది. ‘మాతో పెట్టుకోకు’ అనే సినిమాలోనూ బాలయ్య, రోజా కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘శ్రీకృష్ణార్జున విజయము’ అనే పౌరాణిక చిత్రంలో నటించారు. ఇందులో రోజా ద్రౌపది పాత్ర పోషించగా, బాలకృష్ణ అర్జునుడిగా, శ్రీకృష్ణుడిగా రెండు పాత్రలు పోషించారు.

 balakrishna roja

balakrishna roja

‘పెద్దన్నయ్య, సుల్తాన్’ సినిమాల్లోనూ బాలయ్య-రోజా జంటగా నటించారు. అయితే, ‘పెద్దన్నయ్య’ ఫిల్మ్ బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయింది. కానీ, ‘సుల్తాన్’ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇలా హీరో హీరోయిన్స్ రకరకాల జోనర్స్‌లో సినిమాలు చేసిన వారు నందమూరి బాలయ్య-రోజా మాత్రమే అని చెప్పొచ్చు. రాజకీయంగానూ ఇద్దరు సక్సెస్ కావడం గమనార్హం. రోజా అప్పట్లో టీడీపీలో ఉన్నారు. కానీ, ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. త్వరలో ఏపీ కేబినెట్ మార్పులు ఉంటాయని తెలుస్తుండగా, ఈ సారి రోజా మినిస్టర్ కాబోతున్నారనే వార్తలొస్తున్నాయి. ఇక బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా మరో వైపు సినీ హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘అఖండ’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Tags

Latest News

Related News