Nandamuri Balakrishna : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సినిమాలు చూడాలని సినీ అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, మహేశ్ నటించిన సినిమా ఒకటి నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాన్ని పోలి ఉందట. ఆ సినిమా సంగతేంటి.. మహేశ్ బాబుకు విజయం చేకూర్చిన ఆ సినిమా.. బాలయ్యకు ఎందుకు విజయం చేకూర్చలేదు అన్న విషయాలు తెలుసుకుందాం..
Srimanthudu Mahesh babu jananne janma bhoomi
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించడమే కాదు.. మహేశ్ బాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా స్ఫూర్తితో చాలా మంది ఊర్లను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేశారు. ఇంకా చేస్తున్నారు కూడా. కాగా, ఈ దత్తత కాన్సెప్ట్‌తో అప్పట్లోనే ఓ సినిమా వచ్చిందన్న సంగతి మీకు తెలుసా.. ఆ సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ కావడం గమనార్హం.
1984లో కళా తపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకకెక్కని మూవీ ‘జననీ జన్మభూమి’. ఈ చిత్రంలో బాలయ్య రమేశ్ అనే పాత్రను పోషించాడు. ఇందులో రమేశ్ కోటీశ్వరుడి కొడుకు కాగా ఈయనకు సర్వ సుఖాలు ఉండి లగ్జరియస్ లైఫ్ ఉన్నప్పటికీ ఎప్పుడూ ఏదో వెలితితో బాధపడుతుంటారు. ఆ టైంలో రమేశ్‌కు హీరోయిన్ పద్మిణి పరిచయం అవుతుంది. అలా ఆమె ద్వారా తన సొంతూరు గురించి రమేశ్ తెలుసుకుంటాడు.. సరిగ్గా ఇటువంటి స్టోరి లైన్ ‘శ్రీమంతుడు’ సినిమాలో మనం చూడొచ్చు. కోటీశ్వరుడి కుమారుడైన మహేశ్ బాబుకు శ్రుతి హాసన్ ద్వారా తన సొంతూరు గురించి తెలుస్తుంది.
Nandamuri Balakrishna
‘జననీ జన్మభూమి’ చిత్రంలోనూ రమేశ్ పాత్రలో బాలయ్య గ్రామంలో చేయబోయే అభివృద్ధి పనులకు విలన్ అడ్డుపడుతుంటాడు. సేమ్ సీన్ మనం ‘శ్రీమంతుడు’ ఫిల్మ్‌లోనూ చూడొచ్చు. అయితే, మహేశ్‌బాబు నటించిన సినిమా హిట్ కాగా, బాలయ్య ‘జననీ జన్మభూమి’ సినిమా మాత్రం సరిగా ఆడలేదు.
Nandamuri Balakrishna Srimanthudu Mahesh babu
బహుశా మూవీ మేకింగ్‌లో కళాతపస్వి కె.విశ్వనాథ్ స్టైల్ వేరుగా ఉండిపోవడం ఒక కారణం కావచ్చు. దాంతో పాటు స్టోరి లైన్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడం మరొక అంశంతో పాటు బాలకృష్ణ సినిమా అంటే యాక్షన్ సీన్స్ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఉందేమో తెలియదు. కానీ, సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ‘జననీ జన్మభూమి’ చిత్రంలో బాలకృష్ణకు తల్లిగా శారద, జోడీగా సుమలత నటించారు. ‘శ్రీమంతుడు’ ఫిల్మ్‌లో మహేశ్ బాబుకు తల్లిగా సుకన్య, జోడీగా శ్రుతిహాసన్ నటించింది.