Jabardasth Naresh : బుల్లితెరపై జబర్దస్త్ను కొట్టే షో ఇంకోటి రాలేదు. ఆ క్రేజ్ అలాంటిది. దశాబ్ద కాలంగా జబర్దస్త్ టాప్ రేంజ్ లో దూసుకుపోతోంది. టీఆర్పీ పరంగా కూడా జబర్దస్త్ టాప్ పొజీషన్ లో ఉందనే చెప్పుకోవాలి. ఈ షోలోకి ఎంతో మంది వచ్చారు. ట్యాలెంట్ ఉన్న వారికి ఎప్పటికప్పుడు ఛాన్సులు ఇస్తూనే ఉంది జబర్దస్త్. ఇప్పటికే చాలా మంది ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు..
మరి ఈ షో ద్వారా గుర్తింపు పొందిన వారిలో పొట్టి నరేష్ ఒకరు.. ఈ వేదికపై తనను తాను నిరూపించుకున్న నటుల్లో జబర్దస్త్ నరేష్ కూడా ఒకడు.. ఇతడు తనదైన పంచ్ డైలాగులు, కామెడీ టైమింగ్ తో అందరినీ ఎంటర్ టైన్ చేశాడు. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తున్నాడు. కేవలం ఒక టీమ్ లో మాత్రమే ఉండకుండా అన్నిటీమ్స్ లలో నటిస్తూ ఉంటాడు.
ఇక ఇప్పుడు నరేష్ తండ్రి కూడా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. మల్లెమాల యాజమాన్యం కమెడియన్ల కుటుంబ సభ్యులను కూడా ప్రేక్షకులకు అప్పుడప్పుడు పరిచయం చేస్తూ ఉంటుంది.. ఇప్పటికే చాలా మంది కమెడియన్ల కుటుంబ సభ్యులు స్టేజ్ మీదకు తీసుకు వచ్చారు. వారితో స్కిట్ కూడా చేయించారు.. తాజాగా నరేష్ తండ్రితో కూడా స్టేజ్ మీద స్కిట్ చేయించారు..
శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఇప్పటికే నరేష్ తండ్రి ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. అప్పుడు స్కిట్ చేయకపోయినా ఇప్పుడు మాత్రం స్కిట్ చేసి అలరించాడు.. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తుంటే నరేష్ తన తండ్రి మీద బాగానే పంచులు వేసాడు.. ఇతడు పెద్దగా డైలాగ్స్ చెప్పకపోయినా ఎక్స్ ప్రెషన్స్ తోనే అలరించాడు.. ప్రెజెంట్ ఈ ప్రోమో నెట్టింట వైరల్ అయ్యింది..
Read Also : Superstar Krishna AV : సూపర్ స్టార్ కృష్ణ ఎవి ని చుస్తే కన్నీళ్లు ఆగవు
Read Also : Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ 11వ రోజు వేడుకలో మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్