Natural Star Nani : నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో జోరు మీదున్నాడు. ఇక ఎప్పటి నుంచో ఎదరు చూస్తున్న వంద కోట్ల ఆశ కూడా దసరా సినిమాతో నెరవేరింది. పైగా ఆయన పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ అయ్యాడు కూడా. దీంతో ఆయనకు మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు వరసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా నానికి సంబంధించిన ఓ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని అంజనా అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే నాని అంజనా కంటే ముందే ఓ స్టార్ హీరోయిన్ ను ప్రేమించాడు. ఆ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ఉండేది.
ఇంతకీ ఆమె ఎవరో కాదండోయ్ హీరోయిన్ నిత్యా మీనన్. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మూవీ అలా మొదలైంది. ఈ సినిమాలో నాని సరసన నిత్యమీనన్ నటించింది. ముగ్గురికి ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. కాగా ఈ సినిమా సమయంలోనే నాని, నిత్యా మీనన్ ప్రేమలో పడ్డారంట.
కానీ ఒక హీరోయిన్ ను తమ ఇంటి కోడలుగా చేసుకోవడానికి నాని పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఒకవేళ నిత్యామీనన్ ఎక్కడ సీక్రెట్ గా పెండ్లి చేసుకుంటాడో అనే భయంతో వెంటనే వారు అంజనా అనే అమ్మాయితో పెండ్లి చేసేశారు. దాంతో నిత్యా మీనన్ కూడా నానికి దూరంగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటుంది.
Read Also : Posani Krishna Murali : బోయపాటి శ్రీనుకు పోసాని కృష్ణ మురళి సొంత అన్నయ్య అని మీకు తెలుసా..?
Read Also : Mahesh Babu : నమత్ర కంటే ముందు మహేశ్ ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?