Natural Star Nani : సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఎదగడం చాలా కష్టం అయిపోయింది ఈ రోజుల్లో. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, కృష్ణ, రవితేజ లాంటి వారు మాత్రమే ఎదిగారు. వారి తర్వాత స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో బ్యాక్ గ్రౌండ్ లేని వారు లేనే లేరు. ఇప్పుడిప్పుడు నేచురల్ స్టార్ నాని లాంటి వారు పుట్టుకొస్తున్నారు.
అయితే నాని ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లోకి తల దూర్చలేదు. ఇండస్ట్రీపై ఎప్పుడూ తనకుండే ప్రేమను చెబుతూ ఉంటాడు. అలాంటి నాని కూడా ఓ సారి ఫైర్ అయ్యాడు. ఏకంగా టాలీవుడ్ అవార్డుల ఫంక్షన్ లోనే.. అది కూడా టాలీవుడ్ హీరోలు, దర్శకులు అందరూ ఉండగానే ఆయన ఈ కామెంట్లు చేశాడు.
ఈ వేడుక గతంలో జరిగింది. ఆ ఈవెంట్ కు రానా, నాని హోస్ట్ గా చేశాడు. కాగా స్టేజిపై ఓ సందర్భంలో నాని మాట్లాడుతూ.. బ్యాక్ గ్రౌండ్ లేదని తొక్కేస్తున్నార్రా.. ఎలాగైనా మా చిరంజీవి గారిని నాకు సపోర్టుగా తీసుకోవాలి అంటూ సరదాగా కామెంట్ చేశాడు. అది కూడా ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారని నాని అనలేదు.
జస్ట్ ఆ ప్రోగ్రామ్ లో ఓ టాస్క్ లో భాగంగా నాని ఇలాంటి కామెంట్లు చేశాడు. కానీ చాలా మందికి నాని చేసిన కామెంట్లు మాత్రం ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారేమో.. అందుకే అంత ఎమోషనల్ గా నాని చెప్పాడు అంటూ అంటున్నారు. ఒకవేళ ఇది కూడా నిజమే అయి ఉండొచ్చు. కానీ నాని మాత్రం బయటకు చెప్పట్లేదు.
Read Also : Rashmi Gautam : నన్ను కూడా చాలామంది కమిట్ మెంట్ అడిగారు.. రష్మీ ఎమోషనల్..!
Read Also : Mahesh Babu : మహేశ్ బాబును మోసం చేసిన డైరెక్టర్.. ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేశాడు..!