Nayanatāra.. పాపం.. ఆ సినిమాలోని నటి మరణిస్తే ‘నయనతార’ చుక్కలు చూసిందట..

Nayanatāra.. నయనతార.. ఈ నటి గురించి ప్రత్యే్కంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంట.. ప్రస్తుతం సౌతిండియాలోనే ఈమె అగ్ర కథనాయికగా కొనసాగుతోంది. అంతేకాకుండా సౌత్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో ఈ మళయాల సుందరి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. నయన్ తన కెరీర్ ప్రారంభంలోనే నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాయి. ఆ తర్వాత దశాబ్ద కాలంలోనే ఈ అమ్మడు రేంజ్ భారీగా పెరిగిపోయింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ […].

By: jyothi

Published Date - Sun - 21 November 21

Nayanatāra.. పాపం.. ఆ సినిమాలోని నటి మరణిస్తే ‘నయనతార’ చుక్కలు చూసిందట..

Nayanatāra.. నయనతార.. ఈ నటి గురించి ప్రత్యే్కంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంట.. ప్రస్తుతం సౌతిండియాలోనే ఈమె అగ్ర కథనాయికగా కొనసాగుతోంది. అంతేకాకుండా సౌత్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో ఈ మళయాల సుందరి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. నయన్ తన కెరీర్ ప్రారంభంలోనే నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాయి. ఆ తర్వాత దశాబ్ద కాలంలోనే ఈ అమ్మడు రేంజ్ భారీగా పెరిగిపోయింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

 

అందాల ఆరబోత.. కాంట్రవర్సీ లైఫ్

నయన్ కెరీర్ ప్రారంభంలో ఎక్స్పోజింగ్‌కు దూరంగా ఉన్నా ఆ తర్వాత తాను కూడా బోల్డ్ యాక్టింగ్‌కు ఓకే చెప్పేసింది. అజిత్ హీరోగా నటించిన తమిళ్ మూవీ ‘డేవిడ్ బిల్లా’లో బికినీ సూట్‌లో అందరినీ మెస్మరైజ్ చేసింది. మళయాలీ బ్యూటీని బికినీలో చూసి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని చెప్పువచ్చు. ఇక నయనతార అందం, అభినయంతోనే పాటు హాట్ హాట్ అందాల ఆరబోతతో సౌత్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది.

ఇకపోతే నయనతార పర్సనల్ లైఫ్ కొంచెం వివాదాస్పదం అని చెప్పుకోవచ్చు. వల్లభ సినిమాలో యాక్టర్ శింబుతో కలిసి నటించాక వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాత మరో డైరెక్టర్‌తో ప్రేమాయణం నడిపి ఏకంగా పెళ్లి పీటలెక్కుతుందనే టైంకు క్యాన్సి్ల్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. మరల ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరొందిన డ్యాన్సర్ కమ్ యాక్టర్, డైరెక్టర్‌తో ప్రేమాయణం సాగించింది. నయన్ కోసమే ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇక వీరి రిలేషన్ కూడా బ్రేకప్ అవ్వడంతో ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉన్నట్టు మరోసారి కన్ఫామ్ చేసింది నయన్..

Nayanatāra..

Nayanatāra..

నయనతార చనిపోయిందని ఫోన్స్..

తమిళంలో మురుగదాస్ డైరెక్షన్‌లో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గజిని’.. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్ అందుకుంది. ఇందులో ఆసిన్, నయనతార నటించిన విషయం తెలిసిందే. ఇదే మూవీని మురుగదాస్ బాలీవుడ్‌లో ఆమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కించా అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఈ మూవీ విడులైన కొన్ని రోజులకు ఇందులో నటించిన ‘జియాఖాన్’ తన గదిలో ఆత్మహత్య చేసుకుంది.

గజిని మూవీ యాక్టర్ చనిపోయిందని తెలియగానే అందరూ నయనతార అనుకుని అదే పనిగా కాల్స్ చేయడం స్టార్ట్ చేశారట. చనిపోయింది తాను కాదని, బాలీవుడ్ నటి అని అందరికీ సమాధానాలు చెప్పలేక నయనతారకు చుక్కలు కనిపించాయట.. చివరకు వారి కాల్స్ భరించలేక ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసిందట.. అలా నయనతార తన తప్పు లేకున్నా కొందరి వలన ఇబ్బంది పడాల్సి వచ్చిందని తెలిసింది.

Tags

Latest News

Related News