Nayanthara : నయనతార అంటే సౌత్ లో స్టార్ హీరోయిన్ అని అందరికీ తెలిసిందే. ఆమె ఇప్పుడు సౌత్ లోనే అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్. రెండు దశాబ్దాలుగా నెంబర్ వన్ కుర్చీని సొంత చేసుకుంటున్న భామ. కెరీర్ పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న నయన్.. వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడూ కాంట్రవర్సీల్లోనే ఉంటుంది.
గతంలో చాలామంది తో డేటింగ్ చేసి వారి సంసారాలను కూల్చేసిందనే విమర్శలు కూడా ఎదుర్కుంది. ఇక విఘ్నేష్ శివన్ ను పెండ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె మీద విమర్శలు ఆగట్లేదు. మరీ ముఖ్యంగా నయన్ చాలా కమర్షియల్ అని.. డబ్బులిస్తేనే ఏ పని అయినా చేస్తుంది తప్ప.. లేదంటే కనీసం ముఖం కూడా చూడదనే పేరుంది.
ముఖ్యంగా సినిమా ప్రమోషన్లు చేయాలంటే నయనతార కు సెపరేట్ అమౌంట్ ఇవ్వాలంట. ఇదే విషయాన్ని తాజాగా నయన్ ను అడగ్గా.. అందులో తప్పేముంది. సినిమా వరకే నేను రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను.. ప్రమోషన్లు చేయాలంటే నా టైమ్ వెచ్చించాలి కదా.. అందుకే దానికి కూడా అమౌంట్ తీసుకోవాలి. అందులో తప్పేముంది అని చెప్పింది.
ఆమె చేసిన కామెంట్లపై భగ్గుమంటున్నారు నెటిజన్లు. మరీ ఇంత కమర్షియల్ ఏంటి నువ్వు.. డబ్బులిస్తే ఏ పని అయినా చేస్తావా అంటూ అడిగి కడిగేస్తున్నారు నెటిజన్లు. అందరు హీరోయిన్లు ఇలా చేయట్లేదు కదా.. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఆమె అభిమానులు.
Read Also : Taapsee Pannu : తెరవెనక నీచమైన పనులు చేస్తారు.. హీరోయిన్లపై తాప్సీ షాకింగ్ కామెంట్లు..!
Read Also : Sara Ali Khan : ఆమెతో నటిస్తే చాలు హీరోలకు పెళ్లైపోతుంది.. ఇంతకీ ఆమె ఎవరంటే..?