Nidhhi Agerwal : నిధి అగర్వాల్ నుంచి త్వరలోనే మరో సినిమా రాబోతోంది. ఆమె ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా వస్తోంది. ఇది పెద్ద హిట్ అయితే మాత్రం నిధికి వరుస అవకాశాలు వస్తాయని ఆశ పడుతోంది ఈ భామ.
ఇటు తెలుగులో నటిస్తూనే అటు తమిళ సినిమాల్లో కూడా చేస్తోంది. అయితే నిధి అగర్వాల్ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో షాకింగ్ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇందులో తనకు జరిగిన ఓ చేదు అనుభవం గురించి వివరించింది.
నేను గతంలో బాలీవుడ్ లో మోడలింగ్ చేస్తున్నప్పుడు ఓ డైరెక్టర్ వద్దకు ఛాన్సుల కోసం వెళ్లాను. అతను నన్ను చూసి నీ ఎద సైజులు బాగా పెద్దగా ఉన్నాయి. వాటి సైజు కొంచెం తగ్గించుకో అప్పుడు నీకు మంచి అవకాశాలు వస్తాయని నీచంగా మాట్లాడాడు. నేను కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాను.
అప్పటి నుంచి నేను అతన్ని కలవలేదు. అతని చెత్త సలహాను కూడా పట్టించుకోలేదు. సిన్సియర్ గా ట్రై చేస్తే నాకు ఛాన్సులు వచ్చాయి. ఇప్పుడు మంచి పొజీషన్ కు వచ్చాను. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాను. హరిహర వీరమల్లు మూవీ మంచి హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది అంటూ తెలిపింది నిధి.
Read Also : Ram Gopal Varma : వ్యభిచారాన్ని తప్పుగా చూడొద్దు.. ఆర్జీవీ ఏంటయ్యా ఈ మాటలు..!
Read Also : Actress Avika Gor : నాకు ఏడుసార్లు పెళ్లి చేశారు.. లైఫ్ నాశనం చేశారు.. అవికా గోర్ ఎమోషనల్ ..!