Nidhhi Agerwal Reacts On Casting Couch : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. స్టార్ హీరోయిన్లు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ భూతాన్ని ఎదుర్కోక తప్పట్లేదు. అయితే గతంలో దీనిపై ఎవరూ పెద్దగా స్పందించే వారు కాదు. కానీ మీటూ ఉద్యమం తర్వాత చాలామంది దీనిపై స్పందిస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆమె ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఆమె హీరోయిన్ గా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు పవన్ కల్యాన్ తో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. కాగా రీసెంట్ గా ఆమె ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది.
నేను బాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఓ డైరెక్టర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను అతని ఆఫీస్ కు వెళ్లాను. అతను నన్ను అదో రకంగా చూడటం స్టార్ట్ చేశాడు. నీకు ఛాన్స్ ఇస్తా గానీ.. నాతో కమిట్ అవ్వాలి అంటూ నేరుగానే అడిగేశాడు. దాంతో చాలా కోపం వచ్చేసింది.
నేను అలాంటి దాన్ని కాదంటూ కోపంతో అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత అతనితో నేను సినిమా ఆఫర్ ఇచ్చినా చేయలేదు. అతను ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద డైరెక్టర్ గా ఉన్నాడు అంటూ తెలిపింది నిధి. కానీ అతని పేరు మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Read Also : Samantha Post Viral On Social Media : జీవితాంతం అతన్నే ప్రేమిస్తా… పెళ్లి అయిన హీరోపై సమంత కామెంట్లు..!