Nidhhi Aggerwal Emotional On Netizens Comments : హీరోయిన్లు అంటేనే చాలా గ్లామర్ గాఉండాలి. లేదంటే వారికి అవకాశాలు రావు. ఎంత ట్యాలెంట్ ఉందనేది ముఖ్యం కాదు.. వారు ఎంత గ్లామర్ గా కనిపించారనేదే అందరికీ కావాలి. అందుకే హీరోయిన్ అనగానే అప్సరసలా ఉండాలనే ట్యాగ్ లైన్ లు ఇచ్చేస్తుంటారు. కాస్త లావుగా ఉన్నా.. కాస్త సన్నగా ఉన్నా సరే బాడీ షేమింగ్ ను ఎదుర్కోవాల్సిందే.
ఇలా చాలామంది గతంలో బాడీ షేమింగ్ ను ఎదుర్కున్నారు. కొందరు అప్పుడప్పుడు వాటిని బయట పెడుతున్నారు. తాజాగా నిధి అగర్వాల్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె ఇప్పుడు పవన్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి.
ఆమె ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతుండగా.. బాడీ షేమింగ్ ప్రస్తావన వచ్చింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. అది నా జీవితంలో కూడా జరిగింది. అందుకే దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. నేను గతంలో సినిమాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు కొందరు.. నా బాడీ సైజులపై కామెంట్లు చేశారు.
బోండాలు ఎక్కడ చేయించావ్ అంటూ దారుణంగా కామెంట్ చేశారు. చాలా అవమానంగా అనిపించింది. అందుకే అప్పటినుంచి నేను పెద్దగా అలాంటివి పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను అంటూ తెలిపింది నిధి అగర్వాల్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Isha Koppikar on Casting Coutch : ఆ హీరో రాత్రి రూమ్ కు రమ్మన్నాడు.. హీరోయిన్ సెన్సేషనల్..!