• Telugu News
  • movies

Heroes Daughter: హీరోల కొడుకులే కాదు కూతుర్లు కూడా వారసత్వం గా నటిస్తున్న వారు

Heroes Daughter: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోలు గా వెలుగొందిన వారి వారసులు ఇండస్ట్రీకి చాలా మంది ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్ వారసుడిగా హరికృష్ణ, బాలకృష్ణ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అలాగే నాగేశ్వరరావు కొడుకు అయిన నాగార్జున కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఇలా చాలా మంది ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం అయిపోయింది కానీ ఈ మధ్య వారసులతో పాటు వారసురాలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు వాళ్ళు ఎవరో ఒకసారి […].

By: jyothi

Published Date - Wed - 15 September 21

Heroes Daughter: హీరోల కొడుకులే కాదు కూతుర్లు కూడా వారసత్వం గా నటిస్తున్న వారు

Heroes Daughter: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోలు గా వెలుగొందిన వారి వారసులు ఇండస్ట్రీకి చాలా మంది ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్ వారసుడిగా హరికృష్ణ, బాలకృష్ణ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అలాగే నాగేశ్వరరావు కొడుకు అయిన నాగార్జున కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఇలా చాలా మంది ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం అయిపోయింది కానీ ఈ మధ్య వారసులతో పాటు వారసురాలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం…


నిహారిక
మెగాస్టార్ తమ్ముడిగా నాగబాబు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించాడు సోలో హీరోగా సక్సెస్ కాలేకపోయినా నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు ప్రొడ్యూసర్ గా కూడా తనదైన శైలిలో సినిమాలను నిర్మించి మంచి అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నాడు. అయితే నాగబాబు కుమార్తె అయిన నిహారిక డి ప్రోగ్రాం ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నాగ శౌర్య ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ లాంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం నిహారిక చైతన్య ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది.

శివాత్మిక & శివాని
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో రాజశేఖర్ అంకుశం, మగాడు లాంటి సినిమాలతో రాజశేఖర్ హీరోగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు అలాగే రాజశేఖర్ జీవిత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాజశేఖర్ కూతురు అయిన శివాత్మిక విజయ్ దేవరకొండ తమ్ముడు అయిన ఆనంద్ దేవరకొండతో నటించిన దొరసాని అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించనప్పటికీ నటిగా శివాత్మికకు మంచి పేరు వచ్చింది.అలాగే రాజశేఖర్ చిన్న‌ కూతురు అయిన శివాని కూడా ఇండస్ట్రీలోకి క‌ల్కి సినిమాతో ప్రొడ్యూస‌ర్ గా అడుగుపెట్టింది.

మంచు లక్ష్మి
మోహన్ బాబు ఒకప్పుడు విలన్ గా చాలా సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న తరువాత హీరోగా మారి పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు మోహన్ బాబు కొడుకులు అయిన విష్ణు, మనోజ్ లు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయం అయ్యారు. మోహన్ బాబు కూతురు అయిన మంచు లక్ష్మి కూడా సిద్ధార్థ హీరోగా రాఘవేంద్ర రావు కొడుకు కె ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ గా నటించి నటిగా మంచి గుర్తింపు సాధించుకుంది ఆ తర్వాత గుండెల్లో గోదారి, దొంగాట ఊ కొడతారా ఉలిక్కి పడతారా లాంటి సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది.

వరలక్ష్మి శరత్ కుమార్
అప్పట్లో శరత్ కుమార్ హీరోగా చాలా సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు.అయితే శరత్ కుమార్ కూతురు అయిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు తమిళ్ లో హీరోయిన్ గా చాలా సినిమాలను చేశారు తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా నటించి మంచి గుర్తింపును సాధించారు. ప్రస్తుతం తెలుగులో చాలా సినిమాల్లో నటిస్తు బిజీగా ఉన్నారు…

Latest News

Related News