NTR – Ravi Teja: ఎన్టీఆర్ వదిలేసిన 3 సినిమాలు రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి ఆ సినిమాలు ఏంటో మీకు తెలుసా…?

NTR – Ravi Teja ఒక హీరో కి ఒక కథ చెప్తే ఆ కథ విని దాని గురించి చాలా రోజులు ఆలోచించి ఆ సినిమా మనకు సెట్ అవుతుందా ఆ క్యారెక్టర్ లో మనం చేస్తే మన ఫ్యాన్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తారా అనే విషయాలను హీరోలు బాగా ఆలోచించుకొని ఈ సినిమాని ఓకే చేయాలా వద్దా అని డిసైడ్ అవుతారు అయితే సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ […].

By: jyothi

Published Date - Sat - 28 August 21

NTR – Ravi Teja: ఎన్టీఆర్ వదిలేసిన 3 సినిమాలు రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి ఆ సినిమాలు ఏంటో మీకు తెలుసా…?

NTR – Ravi Teja ఒక హీరో కి ఒక కథ చెప్తే ఆ కథ విని దాని గురించి చాలా రోజులు ఆలోచించి ఆ సినిమా మనకు సెట్ అవుతుందా ఆ క్యారెక్టర్ లో మనం చేస్తే మన ఫ్యాన్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తారా అనే విషయాలను హీరోలు బాగా ఆలోచించుకొని ఈ సినిమాని ఓకే చేయాలా వద్దా అని డిసైడ్ అవుతారు అయితే సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ వదిలేసుకున్న 3 సినిమాలతో రవితేజ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్ వదిలేసిన ఆ 3 సినిమాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం…


భద్ర
భద్ర సినిమా స్టోరీని మొదటగా దర్శకుడు బోయపాటి శ్రీను ఎన్టీఆర్ కి వినిపించాడు ఎన్టీఆర్ కి కథ నచ్చినప్పటికీ కొత్త డైరెక్టర్ తో సినిమా చేయాల వద్దా అనే డైలమాలో పడి పోయి మొత్తానికి అయితే నో చెప్పాడు అదే కథని బోయపాటి ప్రొడ్యూసర్ దిల్ రాజు కి చెప్పి అందులో హీరోగా రవితేజను సెలక్ట్ చేసుకున్నారు ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రవితేజ కెరీర్ లోనే అప్పటివరకు బెస్ట్ సినిమాగా గుర్తింపు సాధించింది దర్శకుడు బోయపాటి శ్రీను కి కూడా మంచి విజయాన్ని అందించింది ఆ తర్వాత బోయపాటి హీరో వెంకటేష్ తో తులసి సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ తో అఖండ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ కూడా క్రాక్ సినిమా విజయంతో మంచి ఉత్సాహంలో ఉన్నాడు అలాగే తన తదుపరి సినిమా అయిన కిలాడి సినిమాలో నటిస్తూ ఇంకో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు…


కిక్
దర్శకుడు సురేందర్ రెడ్డి తన మొదటి సినిమా కళ్యాణ్ రామ్ తో అతనొక్కడే తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ తదుపరి చిత్రంగా ఎన్టీఆర్ తో అశోక్ సినిమా తీశాడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు దాంతో సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో అతిధి తీశాడు అది కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది అయితే ఈసారి ఒక కామెడీ సినిమా చేయాలని అనుకొని కిక్ స్టోరీ రాసుకొని ఎన్టీఆర్ కి వినిపించాడు ఎన్టీఆర్ కి స్టోరీని వచ్చినప్పటికీ ఆ దర్శకుడి మీద నమ్మకం లేకపోవడంతో ఆ సినిమాని రిజెక్ట్ చేశాడు దాంతో సురేందర్ రెడ్డి ఈ సినిమాని రవితేజతో తెరకెక్కించాడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా ఇప్పటికీ నిలబడిపోయింది…


కృష్ణ
వివి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ అప్పటికే ఆది,సాంబ లాంటి సినిమాల్లో నటించాడు అయితే కృష్ణ కథని వినాయక మొదటగా ఎన్టీఆర్ కి వినిపించాడు కథ బాగా ఉన్నప్పటికీ తను బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని చేయలేకపోయాడు దాంతో వినాయక రవితేజతో కృష్ణ సినిమా తెరకెక్కించాడు ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాగా గుర్తింపు పొందింది అలాగే వినాయక్ తరహా యాక్షన్ సన్నివేశాలు కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…
జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన మూడు సినిమాలు రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి ఒక విధంగా చెప్పాలంటే రవితేజ స్టార్ హీరో గా మారడానికి ఈ మూడు సినిమాలు కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు ఇంకో హీరో చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది కానీ ఎన్టీఆర్ వదిలేసిన మూడు సినిమాలు చేసిన రవితేజ చేయడం అవి రవితేజ కెరీర్ లోనే మంచి విషయాలు గా గుర్తింపు పోవడం అనేది చూస్తే ఈ విషయంలో లో రవితేజ అదృష్టవంతుడు అయితే ఎన్టీఆర్ మాత్రం అదృష్టవంతుడు అని చెప్పాలి…

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News