Tollywood Stars : టాలీవుడ్లో ఎప్పటి నుంచో ఓ వార్ నడుస్తోంది. అదేంటంటే ఏ హీరో నెంబర్ వన్ అనే దాని మీద. మన టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో ఎవరు నెంబర్ వన్ అనేది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే సినిమా, సినిమాకు లెక్కలు మారిపోతూ ఉంటాయి. కాగా వీటికి చెక్ పెడుతూ ప్రముఖ సంస్థ ఆర్మాక్స్ మీడియా ఎప్పటిలాగే ఈ సారి కూడా తన సర్వే ఫలితాలను వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా టాలీవుడ్ స్టార్లకు ఉన్న పాపులారిటీ, జనాల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థ లిస్టును రిలీజ్ చేసింది. 2022 సంవత్సరంలో ఎవరు టాప్ హీరో అనేదాన్ని చెప్పేసింది. ఇందులో ప్రభాస్ అందరినీ వెనక్కు నెట్టేసి నెంబర్ వన్ హీరోగా నిలబడ్డాడు. ఇక ఆయన తర్వాత రెండో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న అల్లు అర్జున్ మూడో స్థానంలో నిలబడ్డాడు. ఇక త్రిబుల్ ఆర్తో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన రామ్ చరణ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక ఐదో స్థానంలో మహేశ్ బాబు ఉన్నాడు. తెలుగులో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కల్యాణ్ ఆరో స్థానంలో ఉన్నాడు.
Organization Released List Of Popularity Of Tollywood Stars Across Country
ఆయన ఎప్పటి నుంచో ఆరో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇక ఏడో స్థానంలో టైర్-2 హీరో అయిన నాని ఉన్నాడు. అలాగే ఎనిమిదో స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నాడు. రీసెంట్ గా వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న చిరంజీవి తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. పదో స్థానంలో మాస్ రాజా రవితేజ ఉన్నాడు.
Also Read : Hansika Motwani : వార్నీ.. హన్సిక ఇంత మందితో ఎఫైర్ పెట్టుకుందా.. మామూల్ది కాదురోయ్..!
Also Read : Senior Actress : ప్రొడ్యూసర్ తో సీనియర్ నటి చీకటి సరసాలు.. పైకి పతివ్రతలా బిల్డప్..!