Samantha : సినిమా అంటేనే నటన. ఎంత బాగా నటిస్తే అంత గొప్ప సినిమా అవుతుంది. ఒక సినిమాలో కొన్ని పాత్రలు స్పెషల్ గా ప్రేక్షకులు గుర్తుండిపోవడానికి కారణం ఆ సినిమాలో నటులు జీవించడమే. అందుకే నటనలో కొందరు లెజెండ్స్ గా నిలిచిపోతారు. అప్పట్లో నటనకు బాగా ప్రాధాన్యత ఉండేది.
అయితే ఈ జనరేషన్ లో హీరోయిన్లు అంటే అందరికీ టక్కున గ్లామర్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఇప్పటి హీరోయిన్ పాత్రలకు నటనకంటే గ్లామర్ ను ఎక్కువగా చూపించేలా పాత్రలను డిజైన్ చేస్తున్నారు. కానీ ఈ జనరేషన్ లో కూడా నటనలో తోపు అనిపించుకుంటోంది ఓ హీరోయిన్.
ఆమె ఎవరో కాదండోయ్ సమంత. సౌత్ ఇండస్ట్రీలో సమంత అంటే టాప్ హీరోయిన్. ఇప్పటికీ టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా ఆమెకు పేరుంది. అయితే ఈ జనరేషన్ లో నటనలో సమంతను కొట్టేవారే లేరని తాజాగా ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది. ఆమె ఎలాంటి పాత్రలు అయినా చేసేస్తుందని తెలిపింది.
తాజాగా బెస్ట్ యాక్టర్ అనే టాస్క్ నిర్వహించారు. ఇందులో సమంత ముందు వరుసలో నిలిచింది. 55 శాతం ఓట్లతో ఆమె నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆమె చేసిన పాత్రలే ఆమెను ఇలా టాప్ పొజీషన్ లో నిలిపాయని చెబుతున్నారు కొందరు నెటిజన్లు.
Read Also : Samantha : సమంతకు గుడి కడుతున్న అభిమాని.. ఫొటోలు వైరల్..!
Read Also : Pawan Kalyan : పవన్ కల్యాణ్ ను పవర్ స్టార్ ను చేసిన దర్శకుడు ఎవరో తెలుసా..?