Pawan Kalyan: ఎవ్వర్ గ్రీన్ + ట్రెండ్ సెట్టింగ్ + క్లాసిక్ = ‘ఖుషి’..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘ఖుషి’ విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. పేరులో రెండక్షరాలు మాత్రమే కలిగిన ఈ సినిమా.. దానికి వందల రెట్లు మంచి పేరు సంపాదించుకుంది. తెలుగు చిత్ర సీమలో ‘ఖుషి’ పిక్చర్ గురించి చెప్పాలంటే ఎవ్వర్ గ్రీన్, ట్రెండ్ సెట్టింగ్, క్లాసిక్ లాంటి పదాలన్నింటినీ కలపాల్సి ఉంటుంది. పేరుకు తగ్గట్లే ఆ చిత్రం కోసం తెర ముందు, తెర వెనక పనిచేసినవారందరూ ఖుషి ఖుషి అయ్యారు. ఇప్పటికీ […].

By: jyothi

Published Date - Fri - 20 August 21

Pawan Kalyan: ఎవ్వర్ గ్రీన్ + ట్రెండ్ సెట్టింగ్ + క్లాసిక్ = ‘ఖుషి’..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘ఖుషి’ విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. పేరులో రెండక్షరాలు మాత్రమే కలిగిన ఈ సినిమా.. దానికి వందల రెట్లు మంచి పేరు సంపాదించుకుంది. తెలుగు చిత్ర సీమలో ‘ఖుషి’ పిక్చర్ గురించి చెప్పాలంటే ఎవ్వర్ గ్రీన్, ట్రెండ్ సెట్టింగ్, క్లాసిక్ లాంటి పదాలన్నింటినీ కలపాల్సి ఉంటుంది. పేరుకు తగ్గట్లే ఆ చిత్రం కోసం తెర ముందు, తెర వెనక పనిచేసినవారందరూ ఖుషి ఖుషి అయ్యారు. ఇప్పటికీ ఈ ఫిల్మ్ టైటిల్ చూస్తే చాలు మర్చిపోలేని ఎన్నో విషయాలు ప్రేక్షకుల మదిలో మెదులుతాయి. అప్పటికే ఐదు సూపర్ డూపర్ హిట్లు కొట్టి ఉన్న పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఈ ‘ఖుషి’తో ఎవరెస్ట్ ఎత్తుకి ఎదిగిందనటంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.

ఒకటేమిటి?..

‘ఖుషి’ మూవీలో ప్రతి సీనూ కట్టిపడేస్తుంది. పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డ్రస్సింగ్-హెయిర్ స్టైల్, లుక్, బుక్స్ బ్యాగ్, సాంగ్స్, కామెడీ, సెంటిమెంట్, లవ్ ట్రాక్, డైలాగ్స్, కాలేజీ బ్యాక్ డ్రాప్, హీరో పవన్ కళ్యాణ్ హీరోయిన్ భూమిక అందమైన నడుమును-నాభిని పుస్తకం చాటుగా తొంగి చూడటం, ఏమీ ఎరగనట్లు కవర్ చేసుకోవటం, దాన్ని ఆమె స్వీట్ గా కసిరించుకోవటం, పవర్ స్టార్ ఆడి పాడిన జానపద గీతాలు, సెకండాఫ్ లో వచ్చే కార్నివాల్ ఫైట్, పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన మార్షల్ ఆర్ట్స్.. ఇలా చెప్పుకుంటూపోతే ఖుషీ పిక్చర్ లో నచ్చని సన్నివేశం ఒక్కటీ ఉండదు. ఒక క్షణం కూడా బోర్ కొట్టదు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ ని రేణూ దేశాయ్ డిజైన్ చేయటం విశేషం. ‘యే మేరా జహాన్’ అనే పూర్తి హిందీ పాటను ఒక తెలుగు సినిమాలో పెట్టడం అంతకుముందు ఎవరూ చేయని ప్రయోగం.

రీమేక్.. రికార్డులు..

తెలుగు ‘ఖుషి’ ఫిల్మ్.. తమిళ ‘ఖుషి’కి రీమేక్. రెండు చోట్లా బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ గా నిలవటం చెప్పుకోదగ్గ విషయం. ఈ మూవీ 20 ఏళ్ల కిందటే రూ.20 కోట్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. కోలీవుడ్ లో ఎస్.జె.సూర్య డైరెక్షన్ చేయగా టాలీవుడ్ లోనూ ఆయనే దర్శకత్వం వహించారు. ఒకటీ రెండు సీన్లలో స్వయంగా కనిపిస్తారు కూడా. లవ్-ఇగో నేపథ్యంలో సాగే ఈ సినిమాకు కథని కూడా ఎస్.జె. సూర్యే అందించటం గమనార్హం. కోల్ కతాలో పుట్టిన సిద్ధార్థ్ రాయ్, కోనసీమలోని కైకలూరు గ్రామంలో జన్మించిన మధుమతి ఎలా ఒక్కటయ్యారు, తర్వాత లైఫ్ ని ఎలా గడిపారు అనేదే స్టోరీ. శ్రీసూర్య ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాత ఏఎం రత్నం. 2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఈ పిక్చర్ ని మరో 20, 30 ఏళ్లయినా ఫ్యాన్స్ గుర్తుపెట్టుకుంటారు. దాని ప్రభావం అలాంటిది మరి.

Latest News

Related News