Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అన్నయ్య చిరంజీవి అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరును ఎవరేం అన్నా సరే పవన్ అస్సలు ఊరుకోరు. ఈ విషయం ఎన్నో సార్లు నిరూపితం అయింది. ఇప్పుడు ఇద్దరూ అగ్ర హీరోలుగా ఉన్నారనుకోండి. కానీ ఒకప్పుడు పవన్ చిరు వెనక ఉండేవాడు.
ఆయన సినిమాల్లోకి రాకముందు చాలామందికి చిరు కోసం వార్నింగ్ ఇచ్చాడు. గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన ముగ్గురు మొనగాళ్లు సినిమాకు చిరు, నాగబాబు, పవన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో నటించిన హీరోయిన్ నగ్మా అస్సలు టైమ్ కు వచ్చేది కాదు. తన ఇష్టం వచ్చినప్పుడు షూటింగ్ కు వచ్చేది.
దాంతో మిగతా ఆర్టిస్టులు అందరూ ఇబ్బంది పడేవారు. ఓ సారి చిరంజీవి అందరి ముందు గట్టిగా అడిగాడు. దాంతో నగ్మా చిరును లెక్కచేయని విధంగానే మాట్లాడింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ నేరుగా షూటింగ్ స్పాట్ కు వచ్చాడు. మేకప్ రూమ్ కు వెళ్లి నగ్మాపై సీరియస్ అయ్యాడు.
Pawan Kalyan Gives Warning To Nagma
ఇలాంటి యాటిట్యూడ్ సినిమాలకు పనికిరాదని తెలిపాడు. ఇంకోసారి రిపీట్ కావొద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయాలను గతంలో సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ తెలిపాడు. దాన్ని బట్టి చెప్పుకోవచ్చు పవన్ కు అన్నయ్య చిరు అంటే ఎంత ప్రేమ అనేది. ప్రస్తుతం నగ్మ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఇంకా పెండ్లి చేసుకోలేదు.
Also Read : Chammak Chandra : ఆ హీరో ఇంట్లో పనిమనిషిగా చేశా.. చమ్మక్ చంద్ర కష్టాలు..!
Also Read : Anupama Parameswaran : అతనితో అనుపమ ఘాటు లిప్ లాక్ లు.. తెగించేసిన బ్యూటీ..!