Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్లాప్ సినిమాలు కూడా భారీగా వసూళ్లు సాధిస్తుంటాయి. తెలుగులో ఆయనకు ఉన్నంత వీరాభిమానులు ఇంకే హీరోకు ఉండరనే చెప్పుకోవాలి. పవన్ కు సినిమాల పరంగా కంటే కూడా వ్యక్తిగతంగా ఆయన్ను అభిమానించే వారు ఎక్కువ.
అలాంటి వపన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయాలతో పాటు ఇటు సినిమాల్లో కూడా చాలా బిజీగానే ఉంటున్నారు. చాలా కాలం తర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు పవన్.
పాన్ ఇండియా స్టార్లకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒక్క రోజుకు ఎంత తీసుకుంటారనే ప్రశ్న వైరల్ అవుతోంది. అయితే దీనిపై పవన్ క్లారిటీ ఇచ్చారు. తాను ఒక్క రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటానని వివరించారు.
సాయిధరమ్ తేజ్ తో కలిసి చేస్తున్న మూవీకి కేవలం 20 రోజులే కేటాయించానని.. ఆ మూవీకి రూ.40 కోట్లు తీసుకుంటున్నట్టు వివరించారు పవన్. అంటే తన ఒక్క రోజు రెమ్యునరేషన్ రూ.2 కోట్లు అని వివరించారు పవన్. ఆయన చేసిన కామెట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరీ ఈ రేంజ్ లో తీసుకుంటున్నారా అంటూ షాక్ అవుతున్నారు మిగతా హీరోల ఫ్యాన్స్.
Read Also : Mahesh Babu : నమత్ర కంటే ముందు మహేశ్ ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
Read Also : Director Sujeeth : ఓజీ డైరెక్టర్ సుజిత్ భార్యను చూశారా.. హీరోయిన్లు కూడా పనికి రారు..!