• Telugu News
  • movies

Pawan Kalyan : పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్.. వెండితెర పోలీసులుగా సత్తా చాటిన హీరోలు..!

Pawan Kalyan : పోలీసు..సమాజాన్ని రక్షించే సైనికుడు.. పోలీసు కావాలని చాలా మంది యువకులు కలలు కంటుంటారు. సమాజ రక్షణలో సైనికుడిగా తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తుంటారు. ఈ సంగతులు అలా ఉంచితే.. వెండితెరపైన పోలీసు పాత్రలు పోషించి సక్సెస్ అవడం ఆ నాటి కాలం నుంచి ఉంది. అలానాటి తారలు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణంరాజు వెండితెరపైన పోలీసు పాత్రలు పోషించి చక్కటి పేరు సంపాదించుకున్నారు. కాగా, ఈ నాటి తరం హీరోలూ పోలీసు […].

By: jyothi

Published Date - Sat - 20 November 21

Pawan Kalyan : పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్.. వెండితెర పోలీసులుగా సత్తా చాటిన హీరోలు..!

Pawan Kalyan : పోలీసు..సమాజాన్ని రక్షించే సైనికుడు.. పోలీసు కావాలని చాలా మంది యువకులు కలలు కంటుంటారు. సమాజ రక్షణలో సైనికుడిగా తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తుంటారు. ఈ సంగతులు అలా ఉంచితే.. వెండితెరపైన పోలీసు పాత్రలు పోషించి సక్సెస్ అవడం ఆ నాటి కాలం నుంచి ఉంది. అలానాటి తారలు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణంరాజు వెండితెరపైన పోలీసు పాత్రలు పోషించి చక్కటి పేరు సంపాదించుకున్నారు. కాగా, ఈ నాటి తరం హీరోలూ పోలీసు పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జనరేషన్ హీరోలపై స్పెషల్ స్టోరి.

ప్రజెంట్ జనరేషన్ హీరోస్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్..వెండితెరపై ఆయన కనబడితే చాలు.. ప్రేక్షకులు ఊగిపోతుంటారు. పవన్ తొలిసారి పోలీసు పాత్రలో ‘గబ్బర్ సింగ్’ సినిమాలో కనిపించాడు.

Pawan Kalyan  Police

Pawan Kalyan Police

ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చూపడమే కాదు.. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు పాత్రలో తన స్టామినా చూపాడు. అయితే, ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫిల్మ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రంలో పోలీసు ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ ఫిల్మ్ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది.

Mahesh babu police

Mahesh babu police

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఖాకీ డ్రెస్సులో అదరగొట్టేశాడు. ‘పోకిరి’ సినిమాలో అండర్ కవర్ కాప్‌గా కనిపించిన మహేశ్..ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘దూకుడు’ సినిమాలోనూ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ కాగా, వీరి కాంబినేషన్‌లో వచ్చిన మరో చిత్రం‘ఆగడు’ మాత్రం బాక్సాఫీసు వద్ద తుస్సుమనిపించింది.

Raviteja police

Raviteja police

ఈ చిత్రంలో ‘ఎన్ కౌంటర్ శంకర్’గా మహేశ్ కనిపించినప్పటికీ ప్రేక్షకుల మెప్పు పొందలేదు. జూనియర్ ఎన్టీఆర్ ‘బాద్ షా’ చిత్రంలో పోలీసు డ్రెస్‌లో కనిపించాడు. ఆ తర్వాత ‘టెంపర్’ సినిమాలోనూ ఖాకీ డ్రెస్సు ధరించిన తారక్..

Jrntr police

Jrntr police

ఆ సినిమాతో తన టెంపర్ చూపించేశాడు. ‘అదుర్స్’ సినిమాలో సీక్రెట్ పోలీసుగా కనిపించిన ఈ హీరో.. ‘శక్తి’ సినిమాలోనూ కొంత సేపు పోలీసు ఆఫీసర్‌గా కనిపిస్తాడు.

ramcharan tej police

ramcharan tej police

మాస్ మహారాజ రవితేజ ‘వెంకీ, పవర్, టచ్ చేసి చూడు, క్రాక్’ సినిమాలో పోలీసుగా కనిపించాడు. ప్రజెంట్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫిల్మ్‌లోనూ పోలీసు పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ సినిమాలో ఖాకీ డ్రెస్సులో కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. రామ్ చరణ్ తేజ్ ‘తుపాన్, ధృవ’ సినిమాల్లో ఖాకీ డ్రెస్సు ధరించగా, కల్యాణ్ రామ్ నందమూరి ‘పటాస్’ ఫిల్మ్‌లో, ఆర్జీవీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘డిపార్ట్‌మెంట్’ సినిమాలో రానా, ‘వీ’ సినిమాలో సుధీర్ బాబు, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నాగచైతన్య పోలీసుగా కనిపించాడు.

Tags

Related News