Director Sujeeth : యంగ్ డైరెక్టర్ సుజిత్ ఇప్పుడు పెద్ద ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. రన్ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన.. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత సాహో సినిమా తీశాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీ వసూళ్ల పరంగా బాగానే రాబట్టినా.. ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.
ఆ మూవీ దెబ్బకు చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు సుజీత్. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ కల్యాణ్ హీరోగా ఆయన ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను తీస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా తర్వాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో మళ్లీ తన కెరీర్ ను నిలబెట్టుకోవాలని సుజీత్ ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అసలు సుజీత్ కు పెండ్లి అయిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. సుజీత్ కు గతంలోనే పెండ్లి అయింది.
Photos Of Director Sujeeth Wife Pravallika Are Going Viral On Social Media
ఆయన ప్రవల్లిక అనే అమ్మాయితో ఏడడుగులు వేశాడు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. చాలా కాలంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇక సుజీత్ దర్శకుడిగా మారిన తర్వాత గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా పెండ్లి చేసుకున్నారు. అయితే సుజీత్ వైఫ్ స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు.
అంత అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సుజీత్ భార్య ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి.
Also Read : Sharwanand : భయంకర సమస్యతో బాధ పడుతన్న శర్వానంద్.. అందుకే పెండ్లి వాయిదా..?
Also Read : Natural Star Nani : అంజనా కంటే ముందే నాని ఆ హీరోయిన్ ను ప్రేమించాడని తెలుసా..?