Pooja hegde : టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌లో ఒకరు. ఇమె ఒక మోడల్ కూడా. 2010 సంవత్సరంలో మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా నుంచి ఎంపికైంది ఈ బుట్టబొమ్మ. ఆ పోటీల్లో సెకండ్ ప్లేస్ సాధించింది. తర్వాత 2012లో ఓ తమిళ్ మూవీలో యాక్ట్ చేసే చాన్స్ వచ్చింది. 2014లో ఒక లైలా కోసం మూవీలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. ఒకే సంవత్సరంలో ముకుంద, ఒక లైలా కోసం మూవీస్‌లో యాక్ట్ చేసింది. ఈ మూవీస్ లో ట్రెడిషనల్ గా కనిపించిన పూజ.. అల్లు అర్జున్ తో కలిసి యాక్ చేసిన దువ్వాడ జగన్నాథం మూవీలో అందాలను ఆరబోసింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ యాక్ట్ చేసిన రంగస్థలం మూవీలో ఓ ఐటమ్ సాంగ్ చేసి ఇంకా ఫేమస్ అయింది. తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ రానిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్న రాధేశ్యామ్ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. దీనితో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.
pooja hegde
ఇదిలా ఉండగా ఈ అమ్మడు తన ఫొటోలన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో ఆ బుట్టబొమ్మ.. నెత్తిన టోపీ పెట్టుకుని క్యూట్‌గా నవ్వుతూ కనిపిస్తుంది. ఇంకేమంది ఈ ఫొటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
pooja hegde