Posani-Ali-Prudhviraj : సీనియర్ కమెడియన్స్‌కు బ్రేకులు వేసిన పాలిటిక్స్? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

Posani-Ali-Prudhviraj : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాలిటిక్స్ చాలా ఏండ్ల క్రితమే భాగమైపోయాయి. కానీ అవి ఆర్టిస్టుల వరకు వెళ్లలేదు. అనేక పార్టీలకు చెందిన వారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా.. మూవీస్ విషయంలో అంతా ఒక్కటే అనుకుంటూ సాగారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో సైతం పాలిటిక్స్ రంగులు మారుతున్నాయి. విషయమైతే తెలియదు కానీ.. ఓ పార్టీకి చెందిన ఆర్టిస్టులు మరో పార్టీకి చెందిన ఆర్టిస్టులను టార్గెట్ చేస్తున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. దీని వల్ల కొందరు కమెడియన్స్ చాన్సులు […].

By: jyothi

Published Date - Tue - 30 November 21

Posani-Ali-Prudhviraj : సీనియర్ కమెడియన్స్‌కు బ్రేకులు వేసిన పాలిటిక్స్? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

Posani-Ali-Prudhviraj : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాలిటిక్స్ చాలా ఏండ్ల క్రితమే భాగమైపోయాయి. కానీ అవి ఆర్టిస్టుల వరకు వెళ్లలేదు. అనేక పార్టీలకు చెందిన వారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా.. మూవీస్ విషయంలో అంతా ఒక్కటే అనుకుంటూ సాగారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో సైతం పాలిటిక్స్ రంగులు మారుతున్నాయి. విషయమైతే తెలియదు కానీ.. ఓ పార్టీకి చెందిన ఆర్టిస్టులు మరో పార్టీకి చెందిన ఆర్టిస్టులను టార్గెట్ చేస్తున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. దీని వల్ల కొందరు కమెడియన్స్ చాన్సులు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. కానీ ఇది నెచురల్ గా జరుగుతుందా? లేక కావాలనే కొందరు చేస్తున్నారా అనేది బయటపడటం లేదు.


Posani Krishna Murali

Posani Krishna Murali


తెలుగు ఇండస్ట్రీలో అలీ, పృథ్వీ, పోసాని కృష్ణమురళి చాలా సీనియర్ ఆర్టిస్టులు. వీరి గురించి స్పెషల్ పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. అనేక మూవీస్ లో యాక్ట్ చేసిన తమకంటూ స్పెషల్ గా గుర్తింపును సంపాదించుకున్నారు. దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. ఎప్పుడూ చాన్స్ ల కోసం ఎదురుచూడలేదు. మూవీ యునిట్స్ వారే వీరిని వెత్తుక్కుంటూ వచ్చేవారు. కానీ వీరి పరిస్థితి ఇప్పుడు అలా లేదు. ఈ ముగ్గురికి చాన్సులు కరువయ్యాయి. అయితే ఎన్నికల టైంలో ఈ ముగ్గురు వైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఎలక్షన్స్ అయిపోయాక మూవీస్ లో యాక్ట్ చేద్దాం అనుకున్న ఈ ముగ్గురికి మునుపటి మాదిరిగా ఆఫర్స్ రావడం లేదు. దీనిపై పోసాని సైతం అప్పట్లో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇండస్ట్రీలో టీడీపీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, తమకు ఆఫర్స్ రాకుండా వారే చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.


ali

ali


ఇటీవలే ఓ పెద్ద ప్రాజెక్టు నుంచి తనను తప్పించేశారని అలాంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చాలానే ఉన్నారని తెలిపారు పోసాని. అందులో భాగంగానే అశ్వినీదత్ పేరు సైతం చెప్పారు. మొన్న పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. తెలుగు ఇండ‌స్ట్రీని ఆంధ్రప్రదేశ్‌కు త‌ర‌లించాల‌నే భావన సరికాదని తెలిపారు. పోసాని మాత్రమే కాదు.. ఆలీ, పృథ్వీ లాంటి వారు స్టార్ కమెడియన్ లిస్టులోంచి ఖాళీ అయిపోయారు. ఆఫర్స్ కోసం వీరు ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. మరి ముందు నుంచి ఒకే తల్లి బిడ్డల్లా ఉన్న నటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు.. ప్రస్తుతం ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ ముగ్గురు కమెడియన్స్ కు మునిపటి లాగా ఆఫర్స్ వస్తాయా? లేక వీరు ఇండస్ట్రీకి శాశ్వతంగా దూరమవుతారా అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.


prudhvi raj

prudhvi raj

Tags

Latest News

Related News