Posani Krishna Murali : సినిమా ఇండస్ట్రీలో పోసాని కృష్ణ మురళి అంటే తెలియని వారుండరు. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుకు కూడా మంచి క్రేజ్ ఉంది. ఇద్దరూ ఇద్దరే. ఒకప్పుడు పోసాని డైరెక్టర్ గా కూడా పని చేశారు. అంతకు ముందు ఆయన రైటర్ గా పని చేశారు. అయితే బోయపాటి శ్రీను వ్యక్తిగతం గురించి చాలామందికి తెలియదు.
ఈ బోయపాటి శ్రీను ఎవరో కాదండోయ్. పోసాని కృష్ణ మురళికి స్వయంగా తమ్ముడు. అంటే సొంత తమ్ముడు కాదు. వీరిద్దరిదీ గుంటూరు జిల్లాలోని పెద కాకాని అనే ఊరు. పోసాని కృష్ణ మురళి తండ్రి, బోయపాటి శ్రీను తండ్రి స్వయంగా అన్నదమ్ములు. అంటే వీరిద్దరూ అన్నదమ్ముల కొడుకులు అన్నమాట.
అలా బోయపాటికి పోసాని అన్నయ్య అవుతారు. మొదట్లో పోసాని రైటర్ గా ఉన్నప్పుడు బోయపాటికి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ను తెలుసుకుని అతన్ని తీసుకు వచ్చాడు పోసాని. తాను రైటర్ గా పని చేస్తున్న గోకులంలో సీత సినిమాకు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టించాడు.
అప్పటి నుంచి తాను డైరెక్టర్ గా అయ్యేంత వరకు బోయపాటి అతని వద్దనే డైరెక్షన్ డిపార్టుమెంట్ లోనే పని చేశాడు. భద్ర సినిమాతో బోయపాటి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెనక్కు తిరిగి చూసుకోవట్లేదు.
Read Also : Mega Star Chiranjeevi : బలవంతంగా ఆ హీరోయిన్ తో చిరు లిప్ లాక్.. చివరకు భారీ ట్విస్ట్..!
Read Also : Eesha Rebba : తెలుగు అమ్మాయిలు పడుకోరు.. ఈషారెబ్బా షాకింగ్ కామెంట్లు..!