Prabhas : టాలీవుడ్ లో అసలు నెంబర్ వన్ హీరో ఎవరు.. అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. మా హీరోనే అంటే మా హీరోనే అంటూ వారి ఫ్యాన్స్ గొడవకు దిగుతుంటారు. అయితే ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయంపై ప్రముఖ మీడియా సంస్థ సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సంస్థ చేపట్టే సర్వేలకు మంచి క్రెడిబిలిటీ కూడా ఉంటుంది.
ఇక తాజాగా ఈ నెలలో మరోసారి తన సర్వే ఫలితాలను వివరించింది ఈ సంస్థ. ఇందులో మళ్లీ నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రభాస్ పేరు మార్మోగుతోంది. సోషల్ మీడియాలో ఆయన పేరు ట్రెండింగ్ లో ఉంది. దాంతో ఆయనే మరోసారి ఈ కుర్చీని దక్కించుకున్నాడు.
ఇక రెండో స్థానంలో రామ్ చరణ్ నిలిచాడు. త్రిబుల్ ఆర్ కారణంగా ఆయన పేరు హాలీవుడ్ స్థాయిలో వినపడింది. ఆయన ఈసారి తన ర్యాంకును మెరుగు పరుచుకున్నాడు. ఇక మూడో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఆస్కార్ కారణంగా ఆయనకు ఈ ర్యాంకు దక్కింది. నాలుగో స్థానంలో పుష్పరాజ్.. అదేనండి అల్లు అర్జున్ ఉన్నాడు.
Prabhas Became Number One Hero In Survey Of Leading Media Company
ఎప్పటిలాగే మహేశ్ బాబుకు ఈ సారి కూడా ఐదో ర్యాంకు దక్కింది. ఇక పవన్ కల్యాణ్ టాప్-5లో చోటు కోల్పోయాడు. ఆయనకు ఆరో ర్యాంకు దక్కింది. ఇక దసరా సినిమాతో పెద్ద హిట్ అందుకున్న నాని.. ఏదో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక ఎనిమిదో స్థానంలో చిరంజీవి, తొమ్మిదో స్థానంలో రవితేజ, పదో స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నారు.
Read Also : Samantha : హీరోల మీదే ఆధారపడాలి.. లేదంటే మాకు ఛాన్సులు రావుః సమంత
Read Also : Sai Pallavi : అక్కడ చేతులు వేసి నొక్కాడు.. చేదు అనుభవం చెప్పిన సాయిపల్లవి..!