Prabhas: ఇంకా పెరిగిన ప్రభాస్ రేంజ్.. ‘రాధేశ్యామ్’ క్లైమాక్స్ కోసం అన్ని కోట్ల ఖర్చు.. 

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలు కోసం సినీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రేక్షకులకు చివరగా ‘సాహో’ చిత్రంలో కనిపించారు. ఆ చిత్రం తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. కాగా ఆయన నటించిన పీరియాడిక్ లవ్ స్టోరి ‘రాధేశ్యామ్’ వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా క్లైమాక్స్ కోసం మేకర్స్ […].

By: jyothi

Published Date - Wed - 20 October 21

Prabhas: ఇంకా పెరిగిన ప్రభాస్ రేంజ్.. ‘రాధేశ్యామ్’ క్లైమాక్స్ కోసం అన్ని కోట్ల ఖర్చు.. 

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలు కోసం సినీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రేక్షకులకు చివరగా ‘సాహో’ చిత్రంలో కనిపించారు. ఆ చిత్రం తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. కాగా ఆయన నటించిన పీరియాడిక్ లవ్ స్టోరి ‘రాధేశ్యామ్’ వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా క్లైమాక్స్ కోసం మేకర్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలుస్తోంది.

prabhas radhe shyam climax budget-2

prabhas radhe shyam climax budget-2

ప్రభాస్ బర్త్ డే అయిన అక్టోబర్ 23న ‘రాధేశ్యామ్’ టీజర్ విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో క్లైమాక్స్ కోసం మేకర్స్ అస్సలు వెనుకడుగు వేయలేదట. 15 నిమిషాల ఎపిసోడ్ కోసం ‘రాధే శ్యామ్’ మేకర్స్ ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు పెట్టారట. ఆ సీన్ సినిమాకు చాలా ఇంపార్టెంట్ అని భావించే ఇలా చేశారని తెలుస్తోంది. ఇకపోతే 1975 సంవత్సరంలో నాటి పరిస్థితులకు అనుగుణంగా సెట్ వేసి, అందరినీ ఆకట్టుకునేలా ప్లాన్ చేశారని సమాచారం. ఇక ఈ సినిమాలో ఈ క్లైమాక్స్ సీన్ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా టాలీవుడ్ బుట్ట బొమ్మ, బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవల సినిమా క్లైమాక్స్ షూట్ పూర్తి అయినట్లు తెలుస్తుండగా, ఇందులో రెబల్ స్టార్ కృష్ణం రాజు కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ మూవీలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ పాత్రను పోషించగా, పూజా హెగ్డే ‘ప్రేరణ’గా నటించింది. ఈ సినిమా ద్వారా ప్రభాస్ ‘బాహుబలి’కి మించిన కలెక్షన్స్ అందిస్తాడని మేకర్స్ అంటున్నారు. నిజానికి ప్రభాస్ రేంజ్ ‘బాహుబలి’ చిత్రంతో బాగా పెరిగిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

టాలీవుడ్ టు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ప్రభాస్ ప్రజెంట్ ప్యారలల్‌గా పలు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్ నటిస్తోంది. ‘ఈ చిత్ర షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను తెలంగాణలోని రామగుండంలో మూవీ యూనిట్ ఆల్రెడీ కంప్లీట్ చేసింది. నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఇకపోతే ‘ఆదిపురుష్’ ఫిల్మ్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ‘రావణ’ పాత్రను పోషిస్తున్న సైఫ్ అలీఖాన్, ‘సీత’ పాత్ర పోషిస్తున్న కృతిసనన్ తమ పార్ట్ షూటింగ్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇక త్వరలో ‘రాముడి’ పాత్ర షూటింగ్‌ను ప్రభాస్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ‘మహానటి’ ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ కూడా త్వరలో షురూ కాబోతున్నట్లు సమాచారం.

Tags

Latest News

Related News