Pragya Jaiswal : బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్‌కు సాలిడ్ హిట్ వచ్చేసింది. నందమూరి నటసింహం-బాలయ్య కాంబోలో వచ్చిన ‘అఖండ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ లభిస్తోంది.
Pragya Jaiswal 2
ఈ ఫిల్మ్‌లో ప్రగ్యాజైశ్వాల్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ సంగతులు అలా ఉంచితే.. ప్రగ్యా జైశ్వాల్ లేటెస్ట్ ఫొటోలు ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ట్విట్టర్ వేదికగా ప్రగ్యా జైశ్వాల్ షేర్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Pragya Jaiswal 3
సదరు ఫొటోల్లో ప్రగ్యా చాలా అందంగా కనబడుతోంది. పరువాలన్నీ చూపిస్తూ కుర్రకారు మతి పోగోడుతోంది. బ్లాక్ డ్రెస్‌లో చున్నీ వేసుకుని కూర్చొని, నిలబడి అలా కొంటె చూపులు చూస్తూ.. నవ్వుతూ మురిస్తూ మైమరిచిపోతూ పలు ఫొటోలు షేర్ చేసింది అందాల ముద్దుగుమ్మ ప్రగ్యాజైశ్వాల్. ఈ ఫొటోలను చూసి త్వరలోనే ప్రగ్యా జైశ్వాల్ స్టార్ హీరోయిన్ అయిపోతుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Pragya Jaiswal 4
బ్లాక్ విత్ మిక్స్‌డ్ వైట్ కలర్ బట్టలు ధరించి ఉన్న ప్రగ్యా జైశ్వాల్‌ను చూసి నెటిజన్లు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రగ్యా జైశ్వాల్‌కు సీనియర్ హీరో బాలకృష్ణ మంచి హిట్ సినిమా ఇచ్చారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Pragya Jaiswal 1
తొలుత సీనియర్ హీరో సరసన హీరోయిన్‌గా నటించడమేంటని కొందరు నెటిజన్లు ప్రగ్యా జైశ్వాల్ నెగెటివ్ కామెంట్స్ చేశారు. కానీ, సినిమా రిజల్ట్ చూసి వారు కూడా ఇప్పుడు ఏం మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుణే భామ ప్రగ్యా జైశ్వాల్ త్వరలో మరో సీనియర్ హీరోతో సినిమా చేయబోతున్నదని తెలుస్తోంది. అయితే, ఈ విషయమై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.