Prudhvi Raj : ఆర్ఎక్స్100 బ్యూటీపై పృథ్వీ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.. పృథ్వీ రాజ్ అంటే తెలియని వారు ఉండరేమో.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు.. ఇతడు కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ తనదైన పంచు డైలాగులతో ఆకట్టుకునే వాడు..
అయితే ఈయన గతంలో కొన్ని వివాదాలను కూడా ఎదుర్కున్నాడు.. దీంతో కొద్దిగా గ్యాప్ వచ్చినా మళ్ళీ తిరిగి కొంతకాలం నుండి సినిమాలు చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ04 అనే సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఈయన చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. పాయల్ నా లవర్ అంటూ ఆసక్తికర హాట్ కామెంట్స్ చేసాడు..
రామ్ జక్కల, అఖిల ఆకర్షణ హీరో హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా ఏపీ04 రామాపురం.. ఈ సినిమాను ఎస్వీ శివారెడ్డి నిర్మించారు.. అలాగే హేమ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు.. ఈ వేడుకలో కమెడియన్ పృథ్వీ రాజ్ కూడా సందడి చేసారు.. ఈయన ఈ ట్రైలర్ చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చారు..
ఈ సందర్భంగా ఆయన అక్కడ స్పీచ్ ఇచ్చి నవ్వులు పూయించారు.. ఈ చిత్ర యూనిట్ చాలా కస్టపడి పనిచేసింది అని వాళ్ళు డబ్బులు సంపాదించు కోవడానికి రాలేదని.. సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో వచ్చారని.. ఈ సినిమా తప్పకుండ హిట్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు.. ఇక జెస్సీని పొగుడుతూ కామెంట్స్ చేసారు.. నేను, జెస్సీ మాయాపేటిక సినిమాలో నటించాము.. అందులో నేను పాయల్ రాజ్ పుత్ లవర్ ని.. అమ్మాయి కనిపిస్తే సో స్వీట్ అంటూ కామెంట్స్ చేస్తుంటాడు.. కొద్దిసేపటికే నెంబర్ ప్లీజ్ అంటూ అడుగుతాడు అంటూ అప్పటి సందర్భం గుర్తు చేసుకున్నాడు.
Read Also : Heroines : సోషల్ మీడియా ద్వారా సినిమాల కంటే ఎక్కువ సంపాదిస్తున్న బ్యూటీలు వీరే..
Read Also : Inaya Sultana-Ram Gopal Varma : అందరూ వద్దన్న ఇనయాకు లైఫ్ ఇచ్చిన ఆర్జీవీ.. ఎలాగంటే..?