Bigg Boss 5 Episode 46: తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గత సీజన్స్‌తో పోలిస్తే ఈ సీజన్ చాలా డిఫరెంట్‌గా ఉందని, కంటెస్టెంట్స్‌కు డిఫరెంట్ టాస్కులు ఇవ్వడం ద్వారా షో ఇంకా రసవత్తరంగా సాగుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే బుధవారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రచ్చరచ్చ చేశారు. అసలు ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
టాస్కులో అదరగొట్టిన విశ్వ..
హౌజ్‌లో ఏడో వారం కంటెస్టెంట్స్‌కు ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ ఇవ్వగా అందులో భాగంగా కూతకు ప్రియ వెళ్లింది. ఈ ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ పోటీ పడ్డారు. ఈ టాస్క్‌లో అత్యద్భుతంగా పర్ఫార్మ్ చేయాలనుకున్న విశ్వ ఎల్లో కలర్ స్పెషల్ ఎగ్‌ను గుర్తించాడు. దాంతో మరో ఐదు గుడ్లను పొందే చాన్స్ కొట్టేసి, కాజల్‌ను పోటీదారుగా సెలక్ట్ చేశాడు. అయితే, ఈ ఐదు గుడ్లను పొందాలంటే.. బాడీపైన ఉన్న క్లోత్స్ ఎవరు ఎక్కువగా వేసుకుంటే వారికే బోనస్ ఎగ్స్ వస్తాయని బిగ్ బాస్ తెలిపాడు. దాంతో అండర్ వేర్‌ల నుంచి మొదలుకుని మిగతా క్లోత్స్ వేసుకునేందుకుగాను విశ్వ, కాజల్ పోటీ పడ్డారు. ఈ టాస్క్‌లో కాజల్‌కు సన్నీ హెల్ప్ చేశాడు. అయితే, కాజల్ ఎక్కువ క్లోత్స్ తీసుకురావాలనే ఉద్దేశంలో యానీ మాస్టర్ అండర్ వేర్ తీసుకొచ్చి నవ్వులు పూయించింది.
తన డ్రాయర్‌తో యానీ మాస్టర్ లోపలికి పరుగు..
డ్రాయర్స్ తీసుకురాగానే ఎవిరివి ఈ డ్రాయర్స్ అని యానీ మాస్టర్ అడిగింది. వాష్ రూం దగ్గర ఉంటే పట్టుకొచ్చేశా.. ఎవరివో నాకేం తెలుసు అని కాజల్ చెప్పగా, యానీ మాస్టర్ అది నా డ్రాయర్ అంటూ దానని పట్టుకుని లోపలికి వెళ్లిపోయింది. ఈ ఎపిసోడ్ చూసి బిగ్ బాస్ ఇతర కంటెస్టెంట్స్ , ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు. ఇకపోతే ఈ టాస్క్‌లో విశ్వనే పై చేయి సాధించాడు.
Priya laughed once again-1
యానీ మాస్టర్ సీరియస్..
మొత్తం 106 క్లోత్స్‌ను విశ్వ ధరించగా, కాజల్ కేవలం 79 క్లోత్స్ మాత్రమే తనపై వేసుకుంది. అలా ఈ టస్క్ విన్నర్ అయినందుకుగాను విశ్వకు బోనస్‌గా ఫైవ్ ఎగ్స్ లభించాయి. ఆ తర్వాత తాను ధరించిన క్లోత్స్‌ను విశ్వ తీసేస్తున్న క్రమంలో అతడిపైనున్న చిన్న నిక్కర్‌ను తీసేయాలంటూ ప్రియ కామెడీ చేసింది. ఆ తర్వాత క్రమంలో ఎగ్స్ కోసం యానీ మాస్టర్ పెట్ట వద్దకు వెళ్లింది. అయితే, అక్కడ బుట్టలో ఉన్న ఎగ్‌ను సిరి అప్పటికే కొట్టేసింది. ఈ క్రమంలోనే యానీ మాస్టర్ సీరియస్ అయింది. సింగిల్‌గా ఆడాల్సిన ఆటను గ్రూపులు, గ్రూపులుగా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇబ్బందులు పడ్డ జెస్సీ..
ఇకపోతే ఎగ్స్ కోసం సన్నీ, ప్రియ మధ్య పెద్ద గొడవే జరిగింది. సన్నీ వద్ద నుంచి ఎగ్స్ కొట్టేయడానికి ప్రియ బాగానే ట్రై చేసింది. మొత్తంగా ప్రియ బుధవారం ఎపిసోడ్‌లో నవ్వుల పాలయిందని చెప్పొచ్చు. టాస్క్‌లో భాగంగా టాస్క్ చేయకుండా సన్నీపై చేయి చేసుకున్న ప్రియ.. తన వరకు వచ్చేసరికి దారుణంగా ప్రవర్తించేసింది. తనపైకి చెంప పగులగొట్టేస్తా అని హెచ్చరించింది. ఎగ్స్ సంపాదించేందుకుగాను జెస్సీ ఇబ్బందులు పడ్డారు. బిగ్ బాస్ కండీషన్స్‌తో ఎగ్స్ పొందేందుకుగాను జెస్సీ బాగానే ట్రై చేసి చివరకు ఇబ్బందుల పాలయ్యారు.