Priyamani : సీనియర్ హీరోయిన్లు చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ లో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రియమణి కూడా తెలుగులో వరుస సినిమాలతో జోరు మీద ఉంది. ఆమె కూడా గతంలో స్టార్ హీరోలతో నటించిన సంగతి తెలిసిందే. కానీ స్టార్ ఇమేజ్ ను ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది.
ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇక పెండ్లి తర్వాత బుల్లితెరపై జడ్జిగా చేస్తోంది. అలాగే సినిమాల్లో కీలక పాత్రల్లో మెరుస్తోంది. తాజాగా ఆమె కస్టడీ సినిమాలో నటిస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తునన ఈ సినిమాలో ఆమె ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తోంది.
కాగా తాజాగా మూవీ ప్రమోషన్ లో ఆమె చాలా బిజీగా ఉంటుంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను వెంకట్ ప్రభుతో తెలియకుండానే రిలేషన్ లో మునిగిపోయాను. అయితే అది అందరూ అనుకున్నట్టు సీక్రెట్ రిలేషన్ కాదు. బెస్ట్ ఫ్రెండ్షిప్ రిలేషన్. అందుకే ఆయన అంటే నాకు చాల ఇష్టం పెరిగింది.
ఆయన చాలా విజన్ ఉన్న దర్శకుడు. ఏ సీన్ ను ఎలా తీస్తే బాగుంటుందో ఆయనకు మాత్రమే బాగా తెలుసు. అందుకే ఆయనతో మరో సినిమా ఛాన్స్ వస్తే కచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను అంటూ తెలిపింది ప్రియమణి. ఆమె కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.