Heroes: వేరే భాష హీరోలకు తెలుగులో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చిన ఆ ఒక్క సినిమా ఏంటో మీకు తెలుసా…?

Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన హీరోల సినిమాలు వస్తు విజయాన్ని సాధిస్తూ ఉంటాయి కానీ ఏ ఇండస్ట్రీ లో లేని విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరభాష సినిమా హీరోలను కూడా ఆదరిస్తూ ఉంటారు ఈ విషయాన్ని వేరే భాష హీరోలు కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మన హీరోలని వేరే భాష కు చెందిన ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలియదు గాని తెలుగువారు మాత్రం టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క హీరోని […].

By: jyothi

Published Date - Thu - 2 September 21

Heroes: వేరే భాష హీరోలకు తెలుగులో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చిన ఆ ఒక్క సినిమా ఏంటో మీకు తెలుసా…?

Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన హీరోల సినిమాలు వస్తు విజయాన్ని సాధిస్తూ ఉంటాయి కానీ ఏ ఇండస్ట్రీ లో లేని విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరభాష సినిమా హీరోలను కూడా ఆదరిస్తూ ఉంటారు ఈ విషయాన్ని వేరే భాష హీరోలు కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మన హీరోలని వేరే భాష కు చెందిన ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలియదు గాని తెలుగువారు మాత్రం టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క హీరోని ఆదరిస్తూ ఉంటారు ఆ హీరో తెలుగువాడైనా వేరేవాడు అయిన పర్లేదు అయితే వేరే భాష నుంచి వచ్చి తెలుగులో హీరోలుగా మంచి గుర్తింపును సాధించుకున్న నటులను తర్వాత వచ్చే సినిమాల నుంచి వాళ్ళు వేరే భాష హీరోలు కాదు మన హీరోలే అన్నంతగా తెలుగు జనాలు వాళ్లని ఆదరిస్తూ ఉంటారు అయితే వేరే భాష నుంచి తెలుగు లోకి వచ్చిన హీరోలు ఏ సినిమా ద్వారా తెలుగులో హీరోలు గా సెటిల్ అయిపోయారు ఆ హీరో కి సంబంధించిన ఆ ఒక్క సినిమా ఏంటో తెలుసుకుందాం…

సూర్య గజిని
సూర్య తమిళ్ హీరో అయినప్పటికీ గజిని సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సాధించుకున్నాడు అలాగే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కూడా గుర్తింపు పొందాడు అలాంటి సూర్య కి ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు మన స్టార్ హీరోలతో పాటు సూర్య సినిమాని కూడా రిలీజ్ రోజే చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు అయితే సూర్య మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజిని సినిమాని తెలుగులోకి డబ్ చేశారు దాంతో తెలుగులో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు సూర్య అప్పటినుంచి హిట్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఏ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు కొందరైతే సూర్య తమిళ్ హీరో కాదు తెలుగు హీరోనే అనుకునే అంతగా తెలుగు జనాలు సూర్యని ఆదరించారు…

ఉపేంద్ర రా


విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందిన ఉపేంద్ర కన్నడ హీరో అయినప్పటికీ తెలుగులో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఉపేంద్ర, రా లాంటి సినిమాలతో తెలుగులో ఎక్కువ అభిమానులను సాధించుకున్నాడు.
విక్రమ్ అపరిచితుడు
విక్రమ్ మొదటగా తెలుగు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత తమిళ్ లో సామి లాంటి సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన అపరిచితుడు సినిమా తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని సాధించింది అప్పుడు స్టార్ హీరోలతో పోటీపడి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…

కార్తీ (యుగానికి ఒక్కడు)
సూర్య తమ్ముడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కార్తీ తమిళ్ లో హిట్ అయిన యుగానికి ఒక్కడు సినిమా ని తెలుగులో డబ్ చేశారు ఆ సినిమా విజయవంతంగా నడిచింది మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.దాంతో కార్తీకి మంచి పేరు లభించింది ఆ తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఆవారా సినిమాతో కూడా మంచి గుర్తింపు పొందాడు. తెలుగులో డైరెక్ట్ గా ఊపిరి సినిమా కూడా చేసి హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు.
ధనుష్ రఘువరన్ బీటెక్
రజనీకాంత్ అల్లుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ధనుష్ తమిళంలో హిట్టయిన విఐపి సినిమా ని తెలుగులో డబ్ చేస్తూ రఘువరన్ బీటెక్ పేరుతో రిలీజ్ చేశారు ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అప్పటినుంచి ధనుష్ కూడా తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు వరుసగా సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు…

Latest News

Related News