Rajamouli :రాజమౌళి ఎంత సక్సెస్ ఫుల్ డైరెక్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆయన ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే. అంతలా రాజమౌళి తన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశారు. ఇన్ని రోజులూ టాలీవుడ్ ను మాత్రమే షేక్ చేసిన రాజమౌళి తాజాగా బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రాలతో ఇండియా వైడ్ గా మరియు ప్రపంచవ్యాప్తంగా రికార్డులను నెలకొల్పాడు. చాలా మంది టాప్ హీరోలు ఇప్పుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అంతటి రాజమౌళి మాత్రం సినిమాను కంప్లీట్ చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు. కానీ ఆయన తీసుకున్న సమయం మాత్రం వృథా కావడం లేదని అనేక మంది అభిప్రాయం. ఎప్పుడో వచ్చిన స్టూడెంట్ నెం1 సినిమాతో మొదలైన ఈయన ప్రస్థానం బాహుబలి వరకు సాగింది. ఇప్పుడు తాజాగా ఆయన ప్రెస్టేజియస్ ఆర్ఆర్ఆర్ వంటి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
rajamouli collections
రాజమౌళి సినిమా వస్తుందంటేనే చాలా మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్లు పతాక స్థాయికి చేరుతున్నాయి. రాజమౌళి సినిమా అంటే ప్రస్తుతం 350 కోట్ల పైచిలుకు బడ్జెట్ కంపల్సరి అయింది. 2001లో రాజమౌళి స్టూడెంట్ నెం1 సినిమాతో మొదలైన ఈయన ప్రస్థానం 20 ఏళ్లలో 11 సినిమాలతో ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. అటువంటి రాజమౌళి రికార్డుల మీద ఒకసారి కన్నేస్తే…
rajamouli collections
రాజమౌళి తొలిసారిగా మెగా ఫోన్ చేతబట్టి తీసిన స్టూడెంట్ నెం1 సినిమాకు కేవలం రెండు కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఖర్చయింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ విషయానికి వస్తే దాదాపు 2.75 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కలెక్షన్లు మాత్రం దిమ్మ తిరిగి పోయే రేంజ్ లో వచ్చాయి. ఈ సినిమాకు దాదాపు 12 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. రాజమౌళి సత్తా ఏంటో అక్కడే తెలుగు వారికి సినీ అభిమానులకు తెలిసిపోయింది. ఇక ఎన్టీఆర్ హీరోగానే తెరకెక్కిన సింహాద్రి సినిమా కోసం రాజమౌళి 8 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టించాడు. కానీ ఈ సినిమా ఏకంగా 26 కోట్ల రూపాయలను వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది.
ఈ సినిమాను తెరకెక్కించిన ప్రొడ్యూసర్లు ఎన్నో లాభాలను కళ్ల చూశారు. ఇక రాజమౌళి తీసిన మరో చిత్రం సై కోసం ఆయన 5 కోట్ల రూపాలయను బడ్జెట్ గా ఖర్చు చేశాడు. కానీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మాత్రం ఏకంగా 9.5 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి వావ్ అనిపించింది. ఇక టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఛత్రపతి సినిమా కోసం రాజమౌళి 10 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టించాడు. కానీ ఈ సినిమా మాత్రం దిమ్మతిరిగే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు 21 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.