Saikumar : సినిమా రంగంలో వాయిస్ అనేది చాలా ముఖ్యం. ఒక హీరోకు వేరే వారు వాయిస్ ఇవ్వడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. తమిళ స్టార్ హీరోలకు తెలుగులో చాలామంది డబ్బింగ్ చెబుతుంటారు. ఇక హీరో రాజశేఖర్ కు అప్పట్లో సాయికుమార్ ఎక్కువగా డబ్బింగ్ చెప్పేవారు. రాజశేఖర్ స్టార్ హీరో అయ్యారంటే అందులో సాయికుమార్ పాత్ర ఎంతగానో ఉంది.
ఆయన ప్రతి సినిమాలో గంభీరమైన వాయిస్ ను చూసి.. ఆ వాయిస్ ఆయనదే కావచ్చు అని అంతా అనుకునేవారు. కానీ ఆయన వాయిస్ చాలా పూర్. రాజశేఖర్ కు వాయిస్ ఇవ్వడానికి ఓ సారి సాయికుమార్ వెనకడుగు వేశారంట. ఎందుకంటే ఇద్దరికీ కొన్ని విషయాల్లో గొడవలు వచ్చాయి.
అప్పుడు తాను ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర్ కు వాయిస్ ఇచ్చేది లేదని తెలిపారంట సాయికుమార్. దాంతో రాజశేఖర్ నేరుగా సాయికుమార్ వద్దకు వెళ్లి వార్నింగ్ ఇచ్చారంట. నాకు డబ్బింగ్ చెప్పకపోతే నిన్ను చంపేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారంట. కానీ సాయికుమార్ మాత్రం చెప్పేది లేదంటూ తెగేసి చెప్పారంట.
కానీ సాయికుమార్ తల్లి రాసిన ఓ డైరీని చూసి తన మనసు మార్చుకున్నారంట. ఆమె తన డైరీలో రాజశేఖర్ అంటే ఎంత ఇష్టమో అందులో రాసుకుంది. అది చూసిన సాయికుమార్ తన వాయిస్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎవడైతే నాకేంటి సినిమా నుంచి మళ్లీ డబ్బింగ్ చెప్పారంట.
Read Also : Super Star Mahesh Babu : మహేశ్ కెరీర్ ను రెండుసార్లు నిలబెట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?
Read Also : Pawan Kalyan : భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న పవన్ కల్యాణ్.. బయటపెట్టిన తల్లి..!