Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అందగత్తెలలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యిన ఈ బ్యూటీ చాలా మంది ఫాలోవర్లను దక్కించుకుంది.. తెలుగులో ఒకప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో నటించి స్టార్ హీరోయిన్ గా మెప్పించిన ఈ భామ తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..
కానీ తెలుగు ప్రజలు పంచిన అభిమానాన్ని ఈ అమ్మడు నిలుపుకోలేక పోయింది.. స్టార్ హీరోయిన్ గా వరుస ఆఫర్స్ వరిస్తూ కెరీర్ ఇక్కడ పీక్స్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ కు చెక్కేసింది. కానీ అక్కడ ఈమె ఏ మాత్రం మెప్పించలేక పోయింది. దీంతో ఇటు తెలుగులో స్టార్ స్టేటస్ కోల్పోయి అటు అక్కడ స్టార్ స్టేటస్ దక్కించుకోలేక కెరీర్ ను అయోమయ స్థితికి చేర్చుకుంది.
ముఖ్యంగా ఈ అమ్మడు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో ఈమె కెరీర్ మరింత దెబ్బతింది.. అయితే ఈమె పర్సనల్ విషయాల వల్ల ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది.. బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో గత కొద్దీ రోజులుగా రిలేషన్ లో ఉంది.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి..
ఈ వార్తలపై రకుల్ మాట్లాడుతూ.. మా ప్రేమ విషయాన్నీ దాచడానికి మేము ఇంకా చిన్న పిల్లలం కాదు.. అందులో మాకేం భయం లేదు.. చాలా మంది మేం సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు నమ్ముతున్నారు.. గత ఏడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని వార్తలు వైరల్ చేసారు. అలా మాకు ఇప్పటికే సోషల్ మీడియా రెండు సార్లు సీక్రెట్ పెళ్లి చేసింది.. అంటూ ఈమె ఫన్నీగా సమాధానం చెప్పింది.
Read Also : Niharika Konidela : ఆ హీరో వీపుపై ఎక్కాలని ఉంది.. నిహారిక ఏంటీ మాటలు.. అందుకే విడాకులు అంటూ…!
Read Also : Deepika Padukone : నా ప్రైవేట్ పార్టు చూపించమన్నాడు.. దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్లు..!