Agent Movie : అక్కినేని వారికి ఈ నడుమ టైమ్ పెద్దగా కలిసి రావట్లేదు. ఎందుకంటే నాగార్జున నుంచి మొదలు పెడితే అఖిల్ వరకు ముగ్గురూ ప్లాప్ సినిమాలును చేస్తున్నారు. ఇక అఖిల్ ను ఎలాగైనా పెద్ద హీరోను చేయాలని నాగార్జున చాలానే తంటాలు పడుతున్నారు. కానీ ఏం లాభం.. ఆయన ప్రయత్నాలు మొత్తం ఫెయిల్ అవుతున్నాయి.
ఇక అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన మూవీ ఏజెంట్. దాదాపు రూ.80 కోట్లతో ఈ మూవీని తెరెకెక్కించారు. సురేందర్ రెడ్డి లాంటి పెద్ద దర్శకుడు ఈ సినిమాను తీశారు. శత్రదేశాల కుట్రల నుంచి ఇండియాను కాపాడే కథనంతో వచ్చింది ఈ సినిమా. ఇలాంటి కథలతో చాలానే సినిమాలు వచ్చాయి.
కానీ ఇందులో కథనం కొత్తగా లేదు. రొటీన్ కథతో వచ్చిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. అయితే ఈ మూవీకి సంబంధించి మరో మ్యాటర్ తెరమీదకు వచ్చింది. ఏజెంట్ సినిమాకు మొదటి ఆప్షన్ అఖిల్ కాదంట. ఈ కథను వక్కంతం వంశీ అందించాడు. రామ్ చరణ్ తో తీయాలనే ఉద్దేశంతో సురేందర్ రెడ్డి ఆయనకు కథ వినిపించాడు.
Ram Charan Agent Movie Rejected
కానీ చేతినిండా ప్రాజెక్టులు ఉండటంతో రామ్ చరణ్ సున్నితంగా తిరస్కరించాడు. దాంతో అఖిల్ కు చెప్పి సినిమా తీశాడు సురేందర్ రెడ్డి. ఫలితంగా అఖిల్ కెరీర్ తో పాటు సురేందర్ రెడ్డి కెరీర్ కూడా డైలమాలో పడిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి చెత్త సినిమా నుంచి తప్పించుకున్నందుకు ఆయన లక్కీ హీరో అంటూ చెబుతున్నారు.
Read Also : Tamannaah Bhatia : అతనికి మాత్రమే లిప్ లాక్ ఇస్తా.. ఆ నటుడిపై తమన్నా మోజు..!
Read Also : Samantha : సమంతకు ఇంత మందితో లవ్ ఎఫైర్ వార్తలు వచ్చాయా..?