Ram Gopal Varma : అందరూ ఒక మాట చెబితే… తాను మరో మాట చెబుతాడు. అందుకే ఆయన్ను అందరూ ఆర్జీవీ అంటారు. ఆ పేరులోనే జీవి అనే పేరు ఉందన్నమాట. అందుకే ఆయన చెప్పే మాటలను చాలామంది ఫాలో అవుతుంటారు. కానీ కొందరు మాత్రం వ్యతిరేకిస్తుంటారు. కానీ ఆర్జీవీ మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండా వెళ్తుంటాడు.
ఒకప్పుడు ఆర్జీవీ లెజెండరీ డైరెక్టర్ గా ఉండేవాడు. కానీ రాను రాను ఆయన ఇమేజ్ మొత్తం పోగొట్టుకుంటున్నాడు. కేవలం కాంట్రవర్సీ కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు ఆయన. తాజాగా మరోసారి ఇలాంటి దుమారం రేపే కామెంట్లే చేశాడు వర్మ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఇందులో ఆయనకు సెక్స్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది.
దానికి ఆయన సమాధానం ఇస్తూ… ప్రతి మనిషి జీవితంలో ఫుడ్ ఎంత అవసరమో సెక్స్ కూడా అంతే అవసరం. కొందరు ఫుడ్ కోసం సెక్స్ లో పాల్గొంటారు. అలాంటి వారికి మనం వేశ్య అనే పేరు పెట్టేశాం. వారు చేసే పనికి వ్యభిచారం అని నామకరణం చేశాం. దాన్ని అంత తప్పుగా చూడాల్సిన అవసరం ఏముంది అసలు.
అది కూడా ఒక పని మాత్రమే. అందరం సెక్స్ లో పాల్గొంటాం. వాళ్లు కూడా అదే చేస్తున్నారు కదా. దాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అంటూ కామెంట్లు చేశాడు ఆర్జీవీ. ఇంకేముంది మనోడిపై మళ్లీ ట్రోల్స్ వస్తున్నాయి. నీ దృష్టిలో వ్యభిచారం కూడా గొప్పదేనా బాబూ అంటూ సెటైర్లు వేస్తున్నారు కొందరు.
Read Also : Karate Kalyani : మూడో పెళ్లికి నేను రెడీ.. బాయ్ ఫ్రెండ్ అయినా ఓకే అంటున్న కరాటే కల్యాణీ..!
Read Also : Kangana Ranaut : అవును.. గతంలో చాలామందితో డేటింగ్ చేశా.. కంగనా రనౌత్ బోల్డ్ కామెంట్లు..!