Ram Gopal Varma Made Sensational Allegations Against Star Heros : తెలుగు సినిమా పరిశ్రమపై ఎప్పటి నుంచో ఓ ప్రధాన మైన ఆరోపణ ఉంది. అదేంటంటే.. ఇక్కడ బంధు ప్రీతి అనేది చాలాఎక్కువ. అంటే బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వారికి మాత్రమే అవకాశాలు వస్తాయి తప్ప.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తున్న వారికి మాత్రం ఛాన్సులు రావనే వాదన ఉంది.
ఇక కొందరు యంగ్ హీరోలు అప్పుడప్పుడు సినీ పెద్దలపై సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆర్జీవీ మరో బాంబ్ కూడా పేల్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తెలుగులో కొందరు నిర్మాతలు కావాలనే తమ వారసులను ఇండస్ట్రీలోకి తెస్తున్నారు. తమ వారసుల కోసం ఇతరులను తొక్కేస్తున్నారు.
గతంలో నాకు ఓ తమిళ హీరో ఓ విషయం చెప్పాడు. ఆ హీరో సినిమాలను తెలుగులో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు అడ్డుకున్నారంట. బన్నీ, రానా కోసం తన సినిమాలను ఆ నిర్మాతలు అడ్డుకున్నారని ఆ హీరో నాకు బాధపడుతూ చెప్పాడు. తన సినిమాలను తెలుగులో థియేటర్లు దొరకకుండా ఆ ఇద్దరు హీరోలు చాలాసార్లు అడ్డుకున్నారని ఆ హీరో ఎమోషనల్ అయ్యాడు అంటూ చెప్పాడు ఆర్జీవీ.
నాకు తెలిసి ఆ హీరోను అడ్డుకునే స్టామినా ఎవరికీ లేదు. ఎందుకంటే ఎవరు స్టార్ హీరో అవ్వాలనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కానీ సినిమాల్లో నిర్మాత అడ్డుపడితే మాత్రం స్టార్ హీరో అవడం చాలా కష్టం అంటూ చెప్పాడు ఆర్జీవీ. ఆయన చేసిన కామెంట్లు మరోసారి సంచలనం రేపుతున్నాయి.