Rama Told Shocking News An Interview About SS Rajamouli : రాజమౌళి.. అంటే తెలియని ప్రేక్షకులే ఉండరు. ఆయన తీసే సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయి. హిట్ అయిందా అనే మాట ఉండదు.. ఎంత కలెక్ట్ చేసింది.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టింది అనే లెక్కలు మాత్రమే రాజమౌళి సినిమాల్లో ఉంటాయి. దటీజ్ మన జక్కన్న. అయితే రాజమౌళి వ్యక్తిగత విషయాలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి.
ఆయన రమాను ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వాస్తవానికి రమాకు గతంలోనే పెండ్లి అయి ఓ కొడుకు కూడా ఉన్నాడు. కానీ భర్తతో విడిపోయింది. కొడుకు ఉన్నా సరే రమాను రాజమౌళి ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెండ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ ఓ పాపను కూడా దత్తత తీసుకున్నారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు.
కాగా వీరిద్దరి మధ్య చాలా అండర్ స్టాండింగ్ ఉందంట. ఈ విషయాన్ని గతంలో రమా స్వయంగా వెల్లడించింది. మా ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఏమీ ఉండవు. అన్నీ చెప్పేసుకుంటాం. మా పెండ్లికి ముందే రాజమౌళి వేరే అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ విషయాన్ని నాకు పెళ్లి అయిన తర్వాత చెప్పాడు.
నన్ను వెళ్లి ఓ సారి ఆమెను కలిసి మాట్లాడమన్నాడు. సరే అని నేను వెళ్లి కలిసి మాట్లాడాను. అలాంటి విషయాలు ఎవరూ భార్యలకు చెప్పరు. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ కు ఇదే నిదర్శనం అంటూ చెప్పింది రమా. సినిమాల్లోకి రాకముందే రాజమౌళి ఆమెను ప్రేమించాడంట.