Uday kiran : టాలీవుడ్ లో ఇప్పటికీ ఓ చనిపోయిన హీరో పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. ఆయనకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఆయనే దివంగత హీరో ఉదయ్ కిరణ్. ఆయన అప్పట్లో ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలు చేసేవారు. అప్పట్లో యూత్ లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండేది.
కానీ సడెన్ గా చనిపోయారు. చిరంజీవి కూతురు సుస్మితతో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఆయన వేరే అమ్మాయిని పెండ్లి చేసుకోవడం, అవకాశాలు రాక చనిపోవడం జరిగిపోయాయి. అయితే ఆయన కెరీర్ మొదట్లో రామోజీరావు అడ్డుకోవాలని చూశారంట. తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాను రామోజీరావు నిర్మించారు.
ఈ సినిమాలో వేరే హీరోలను వెతికారు. కానీ హీరో రెమ్యునరేషన్ రూ.11000 మాత్రమే కావడంతో అందరు మేం చేయలేమని చెప్పి వెళ్లిపోయారు. ఇక హీరోగా ఉదయ్ కిరణ్ ను తీసుకుందామని తేజ రామోజీరావుకు చెప్పారు. కానీ ఉదయ్ కిరణ్ ను తీసుకోవడం రామోజీరావుకు కూడా అస్సలు ఇష్టం లేదు.
Ramoji Rao Does Not Want Uday kiran To Be Hero In Chitram Movie
అందుకే వేరే కొత్త హీరోలను చూద్దామని చెప్పాడు. పైగా చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఓ హీరోను కూడా అడిగారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. దాంతో చివరకు చేసేది లేక తేజనే బలవంతంగా ఉదయ్ కిరణ్ ను ఫైనల్ చేశారు. అనుకున్న బడ్జెట్ లోనే సినిమా తీసి పెద్ద హిట్ అందుకున్నారు. దాంతో ఉదయ్ కిరణ్ ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. రామోజీరావు అడ్డుకోవాలని చూసినా ఉదయ్ కిరణ్ హీరోగా మారిపోయాడు.
Read Also : Allu Arjun : ప్రైవేట్ జెట్.. లగ్జరీ కార్లు.. అల్లు అర్జున్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా…?
Read Also : Pawan Kalyan And Alluarjun : పవన్ సినిమా ప్లాప్ అయితే పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఎందుకంత కోపం..?