Rashi Khanna : రాశీఖన్నా ఇప్పుడు పూర్తి డైలమాలో కనిపిస్తోంది. ఆమె కెరీర్ మొన్నటి వరకు పర్వాలేదన్నట్టు సాగింది. కానీ ఇప్పుడు మళ్లీ డైలమాలో పడిపోయింది. ఎందుకంటే ఆమె చేసిన మూడు సినిమాలు వరుసగా ప్లాప్ అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్ల లిస్టులో చేరేలాగే కనిపిస్తోంది.
ఊహలు గుసగుసలాడే మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ నార్త్ బ్యూటీ ఇప్పటికీ టాలీవుడ్ ను పట్టుకుని వేలాడుతోంది. ఇంకా ఏమైనా పెద్ద హిట్ పడుతుందేమో స్టార్ హీరోయిన్ అవుతానేమో అంటూ వేచి చూస్తోంది. కానీ ఆమె కల మాత్రం నెరవేరేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఆమె ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అవుతోంది.
ఆమెతో పాటు ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, శృతిహాసన్ లాంటి వారు టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. కానీ రాశీ మాత్రం ఒక మూవీ హిట్ అయితే రెండు మూవీలు ప్లాప్ అన్నట్టు తయారైంది ఆమె పరిస్థితి. అయితే ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఆమె గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
తాను ఇంకా ఎవరితోనూ లవ్ లో పడలేదని, తాను లవ్ లో పడేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపింది. తనకు బాగా హైట్ ఉండి, గడ్డం ఉండే అబ్బాయి కావాలంటూ తెలిపింది. కలర్ అటు ఇటుగా ఉన్నా పర్లేదు గానీ, గడ్డం ఉన్న అబ్బాయి దొరకితే చేసుకుంటానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. మరి ఇప్పటికైనా ఆమెకు కావాల్సిన వాడు దొరికాడో లేదో చూడాలి.
Read Also : Astrology : ఈ పేరున్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులు.. లక్ష్మీ కాటాక్షం దండిగా ఉంటుందట..
Read Also : Niharika Konidela : చెత్త పనితో మరోసారి మెగా ఫ్యామిలీ పరువు తీసిన నిహారిక.. ఇంక మారదా..?