Rashmi Gautam : యాంకర్ గా రష్మీకి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. జబర్దస్త్ తో మొదలైన ఆమె కెరీర్ ఇంకా అందులోనే సాగుతోంది. కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా ఆమె అటు వెండితెరపై కూడా రాణించింది. ఆమె హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకోలేకపోయింది.
రష్మీకు ఎన్ని సినిమా ఆఫర్లు వచ్చినా సరే జబర్దస్త్ ను మాత్రం వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే తనకు లైఫ్ ఇచ్చింది జబర్దస్తే కదా. అందుకే దాన్ని పట్టుకుని వేలాడుతోంది. ఇదిలా ఉండగా ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ఆమె లేడీస్ కు సంబంధించిన అనేక విషయాలపై మాట్లాడుతూనే ఉంటుంది.
తాజాగా ఆమె ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది. నేను కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నాను. నన్ను కూడా చాలామంది కమిట్ మెంట్లు అడిగారు. కానీ నేను వాటిని లైట్ తీసుకున్నాను. మన దగ్గర ఆత్మవిశ్వాసం ఉంటే కచ్చితంగా ఏదో ఒక రోజు ప్రపంచానికి పరిచయం అవుతాం అని నమ్మాను.
నేను నమ్మిందే నిజం అయింది. ఈ రోజు మీ అందరూ నన్ను గుర్తిస్తున్నారు. అది చాలు నాకు అంటూ రష్మీ ఎమోషనల్ అయింది. రష్మీ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆమె వయసు కూడా మూడున్నర పదులు దాటిపోతోంది. కానీ ఇంకా పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోతోంది.
Read Also : Kotasrinivas Rao : చిరంజీవి సోది చెప్పకు.. ఏదైనా చేసి చూపించు.. కోట శ్రీనివాస్ సంచలనం..!
Read Also : Prabhas : ప్రభాస్ ప్రతిసారి క్యాప్ ఎందుకు పెట్టుకుంటాడు.. అసలు కారణం ఇదే..!