Custody Movie : సినిమా రంగంలో హిట్ అనేది చాటా కంపల్సరీ. సినిమా హిట్ అయితేనే వారికి అవకాశాలు వస్తాయి. లేదంటే లేదు. అయితే కొన్ని సార్లు రిజెక్ట్ చేసిన కథలు అట్టర్ ప్లాప్ అయితే సదరు హీరో, లేదా హీరోయిన్ చాలా లక్కీ అంటారు. ఒకవేళ హిట్ అయితే మాత్రం వారి బ్యాడ్ లక్ అని అంటుంటారు.
ఇప్పుడు కృతిశెట్టి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆమె ఇప్పటికే వరుసగా మూడు ప్లాపులతో అయోమయంలో ఉంది. ఇలాంటి సమయంలో కచ్చితంగా కస్టడీ మూవీతో హిట్ కొట్టాలని ఆశ పడింది. కానీ ఏం లాభం ఆమెకు మరో సారి ప్లాప్ మూటగట్టుకుంది. నాగచైతన్య హీరోగా వచ్చిన కస్టడీ సినిమా దారుణంగా ప్లాప్ అయింది.
అయితే ఈ సినిమా ముందుగా వేరే హీరోయిన్ వద్దకు వెళ్లిందంట. కానీ ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసింది. ఆ లక్కీ హీరోయిన్ ఎవరో కాదండోయ్ నేషనల్ క్రష్ రష్మిక. వెంకట్ ప్రభు ముందుగా ఈ కథను రష్మికకు చెప్పాడంట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేని కారణంగా దీన్ని రిజెక్ట్ చేసింది రష్మిక.
ఆమె కాదన్న తర్వాతనే కృతిశెట్టిని అప్రోచ్ అయ్యాడు వెంకట్ ప్రభు. పాపం కృతి బ్యాడ్లలక్ ఈ మూవీతో ఆమెకు నాలుగో ప్లాప్ ఖాతాలో చేరిపోయింది. నాగచైతన్యకు వరుసగా మూడో ప్లాప్ ఇది. వీరిద్దరూ పెట్టుకున్న ఆశలు మొత్తం అడియాశలు అయిపోయాయి. నాగచైతన్యకు ఎలాగూ ఆఫర్లు వస్తాయనుకోండి.. కానీ కృతికి వస్తాయా లేదా అనేది చూడాలి.
Read Also : Anil Ravipudi : బుద్ధిలేని పని చేస్తున్న అనిల్ రావిపూడి.. నిర్మాతను ముంచేస్తున్నాడా..?
Read Also : Krithi Shetty : నానితో లిప్ లాక్ చేయడం అస్సలు ఇష్టం లేదు.. పరువు తీసేసిన కృతిశెట్టి..!