Vijay Sai : పాపులర్ కమెడియన్ విజయ్ సాయి సూసైడ్ చేసుకోవడానికి గల కారణమిదే..

Vijay Sai : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాస్య నటులు బోలెడు మంది ఉన్నారని చెప్పొచ్చు. బ్రహ్మానందం నుంచి మొదలుకుని ఇటీవల కాలంలో ‘జబర్దస్త్’ కార్యక్రమం నుంచి చాలా మంది వెండితెరకు పరిచయమై హస్య నటులుగా కొనసాగుతున్నారు. హాస్య పండించేలా నటించడం మామూలు నటన కంటే చాలా కష్టమని సినీ పెద్దలు చెప్తుంటారు. కాగా, కమెడియన్‌గా అత్యద్భుతమైన పేరు సంపాదించుకున్న విజయ్ సాయి అర్ధాంతరంగానే తన జీవితాన్ని ముగించేశాడు. అందుకు గల కారణాలు తెలుసుకుందాం. స్టార్ కమెడియన్‌గా […].

By: jyothi

Updated On - Wed - 24 November 21

Vijay Sai : పాపులర్ కమెడియన్ విజయ్ సాయి సూసైడ్ చేసుకోవడానికి గల కారణమిదే..

Vijay Sai : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాస్య నటులు బోలెడు మంది ఉన్నారని చెప్పొచ్చు. బ్రహ్మానందం నుంచి మొదలుకుని ఇటీవల కాలంలో ‘జబర్దస్త్’ కార్యక్రమం నుంచి చాలా మంది వెండితెరకు పరిచయమై హస్య నటులుగా కొనసాగుతున్నారు. హాస్య పండించేలా నటించడం మామూలు నటన కంటే చాలా కష్టమని సినీ పెద్దలు చెప్తుంటారు. కాగా, కమెడియన్‌గా అత్యద్భుతమైన పేరు సంపాదించుకున్న విజయ్ సాయి అర్ధాంతరంగానే తన జీవితాన్ని ముగించేశాడు. అందుకు గల కారణాలు తెలుసుకుందాం.

viajay sai

viajay sai



స్టార్ కమెడియన్‌గా అనతి కాలంలోనే పేరు సంపాదించుకున్న విజయ్ సాయి..‘అమ్మాయిలు అబ్బాయిలు, బ్యాక్ పాకెట్’అనే చిత్రాల్లో లీడ్ రోల్ ప్లే చేశాడు. ఇకపోతే చాలా చిత్రాల్లో కమెడియన్‌గా విజయ్ సాయి నటనను చూసి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు. ‘ఒకరికి ఒకరు, ఓమ్ త్రీడీ, ధనలక్ష్మి తలుపు తడితే, సోగ్గాడు, పార్టీ, మంత్ర, గీత, అందరి బంధువయా, డాన్ సీను, వజ్రాలు కావాలా నాయనా, బొమ్మరిల్లు’ సినిమాల్లో నటించారు. ఈ చిత్రాల్లో విజయ్ సాయి అమాయకపు, హస్య నటనను చూసి ప్రేక్షకులు నవ్వుకున్నారు. కాగా, చిన్న వయసులోనే విజయ్ సాయి తన సొంతింట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.


vijay sai

vijay sai



విజయ్ సాయి సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈ విషయాన్ని సూసైడ్‌కు ముందర రికార్డు చేసిన వీడియోలో విజయ్ సాయి తెలిపాడు. హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందిన విజయ్ సాయి అంత తొందరగా మరణించడం బాధాకరమని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


vijay sai

vijay sai



విజయ్ సాయి కమెడియన్‌గానే కాక ప్రొడ్యూసర్‌గా పలు సినిమాలకు వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఓ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి తన ఆస్తి మొత్తం కోల్పోయాడు. వైవాహిక జీవితంలో తన భార్యతోనూ విజయ్ సాయికి గొడవలు వచ్చాయి. దాంతో విజయ్ సాయి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడ్డాడు. అలా డిప్రెషన్‌కు గురైన విజయ్ సాయి తన ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ‘కొత్తగా మా ప్రయాణం’ అనే చిత్రం విజయ్ సాయి మరణించిన తర్వాత విడుదలైంది.


vijay sai

vijay sai



ఇందులో విజయ్ సాయి నటించాడు. కాగా, తన మరణానికి ముందర విజయ్ సాయి వీడియో రికార్డు చేశాడు. అందులో తను సూసైడ్ చేసుకోవడానికి తన భార్య, ఇతర ఇద్దరు వ్యక్తులని, వారు తనను రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించాడు విజయ్ సాయి. అలా 38 ఏళ్ల వయసులోనే విజయ్ సాయి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. విజయసాయి బతికుంటే డెఫినెట్‌గా ఇంకా గొప్ప నటుడయ్యే వాడని, ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని చాలా మంది అప్పుడు విచారం వ్యక్తం చేసి నివాళి అర్పించారు.

Tags

Related News