Sai Pallavi : నేచురల్ బ్యూటీ సాయిపల్లవికి యూత్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఈ జనరేషన్ లో హీరోయిన్ అంటేనే గ్లామర్ ఆరబోత. గ్లామర్ చూపించకపోతే హీరోయిన్ గా ఛాన్సులు రావు. కానీ మేకప్ లేకుండా నటించిన ఏకైక హీరోయిన్ సాయిపల్లవి. పైగా ఎలాంటి గ్లామర్ ఎక్స్ పోజింగ్ చేయలేదు.
ఇంకో విషయం ఏంటంటే ముఖం మీద ముటిమలతో నటించడానికి సిద్దపడ్డ ఏకైక హీరోయిన్ కూడా ఆమెనే. ఇక సాయిపల్లవికి ఉన్న క్రేజ్ కు ఎన్నో పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ తన పాత్ర నచ్చకపోవడంతో ఆమె సినిమాలను రిజెక్ట్ చేసింది. దాంతో ఆమె పద్ధతికి మారుపేరు అంటూ ఆడియెన్స్ ఆమెను గుండెల్లో పెట్టుకున్నారు.
అలాంటి సాయిపల్లవి మీద కూడా లవ్ ఎఫైర్ రూమర్లు వచ్చాయి. అది కూడా ఒకే ఒక్క హీరోతో. ఆయన ఎవరో కాదు హీరో శర్వానంద్. పడిపడి లేచే మనసు సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి. ప్రేమలో ఉన్నారు కాబట్టే ఈ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాలో చాలా అద్భుతంగా వచ్చింది అంటూ వార్తలు రాశారు.
కానీ వాటిపై శర్వానంద్ గానీ, సాయిపల్లవి గానీ అస్సలు స్పందించలేదు. కానీ తర్వాత కాలంలో అవన్నీ ఫేక్ రూమర్లు అని తేలిపోయింది. ఇప్పుడు సాయిపల్లవి సినిమాల్లో కనిపించట్లేదు. కొంత కాలంగా ఆమె నుంచి ఎలాంటి అప్ డేట్ రావట్లేదు. ఆమె మళ్లీ సినిమాల్లో నటించాలని చాలామంది కోరుకుంటున్నారు.
Read Also : Priyamani : ఆ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్న ప్రియమణి.. ఓపెన్ గా చెప్పేసిందిగా..!
Read Also : Malaika Arora : యాభై ఏండ్ల వయసులో ఇవేం అందాలు మలైకా.. అర్జున్ కపూర్ చాలా లక్కీ..!