Rumors on celebrities death :మీకు తెలుసా? బతికుండగానే ఈ నటుల్ని మీడియా చంపేసింది.

Rumors on celebrities death : మన తెలుగు మీడియాకి ఆత్రం ఎక్కువ. న్యూస్ ఛానళ్ళ మధ్య పోటీ కారణంగా, సినీ నటులెవరైనా ఆసుపత్రిలో చేరితే చాలు, ‘బ్రేకింగ్ న్యూస్.. ఫలానా నటుడు లేదా నటి అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత’ అని ముందే డిసైడ్ అయిపోతారు, అందుకు తగ్గట్టుగా వీడియోలు కూడా ప్రిపేర్ చేసేసుకుంటారు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో ఇలాంటి మీడియా సంస్థల మీదనే దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో పవన్ కళ్యాణ్ ద్వారా […].

By: jyothi

Updated On - Wed - 1 December 21

Rumors on celebrities death :మీకు తెలుసా? బతికుండగానే ఈ నటుల్ని మీడియా చంపేసింది.

Rumors on celebrities death : మన తెలుగు మీడియాకి ఆత్రం ఎక్కువ. న్యూస్ ఛానళ్ళ మధ్య పోటీ కారణంగా, సినీ నటులెవరైనా ఆసుపత్రిలో చేరితే చాలు, ‘బ్రేకింగ్ న్యూస్.. ఫలానా నటుడు లేదా నటి అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత’ అని ముందే డిసైడ్ అయిపోతారు, అందుకు తగ్గట్టుగా వీడియోలు కూడా ప్రిపేర్ చేసేసుకుంటారు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో ఇలాంటి మీడియా సంస్థల మీదనే దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో పవన్ కళ్యాణ్ ద్వారా సెటైర్లేయించాడు. అయినా, న్యూస్ ఛానళ్ళు మారవు గాక మారవు. అలా వారి అత్యుత్సాహం కారణంగా, ఎందరో నటుల కుటుంబాలు, అలాగే ఆయా నటీనటుల అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండిక..

ఏవీఎస్..

avs

avs


కమెడియన్ ఏవీఎస్.. చనిపోయాడంటూ బ్రేకింగ్ న్యూస్ హెడ్ లైన్స్ కనిపించాయి. కానీ, ఆయన కోలుకున్నాడు. తన కుమార్తె లివర్ దానం చేయడంతో బతికారాయన.


ధర్మవరపు సుబ్రహ్మణ్యం..

darmavarapu subramanyam

darmavarapu subramanyam


అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. క్యాన్సర్ కి చికిత్స తీసుకుంటున్న ఈయనను మీడియా ముందే చంపేసింది. అయితే, ఈ న్యూస్ బయటికొచ్చాక కొద్దిరోజులకే ఆయన కాలం చేశారు.


ఎమ్మెస్ నారాయణ..

ms narayana

ms narayana


ఈయన కూడా అంతే, మామూలు అనారోగ్యంతోనే ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరగానే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వేసేశారు.. ఆయన చనిపోయాడని. దాంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, ‘మమ్మల్ని కూడా చంపేస్తారా.?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


మల్లికార్జునరావు (బట్టల సత్తి)

mallikarjuna

mallikarjuna


పగిలిపోయే వార్తల పైత్యం.. అదేనండీ బ్రేకింగ్ న్యూస్.. తొలిసారి తాకింది మల్లికార్జునరావుకే. చక్కగా, ఆరోగ్యంతో ఉన్న ఈయన పేరును చనిపోయిన వారి లిస్టులో మీడియా ముందుగానే ప్రచురించేసింది. నేను బాగానే ఉన్నాను మొర్రో అంటూ ఆయన తర్వాత మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెట్టుకున్న సంగతి చాలా మందికి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈయన మన మధ్య లేరనుకోండి.


చంద్ర మోహన్..

chandra mohan

chandra mohan


గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన నటుడు చంద్ర మోహన్ విషయంలోనూ అలాగే జరిగింది. ఇంకేముంది పరిస్థితి విషమించింది.. అంటూ బ్రేకింగ్ వార్తలేశారు. కానీ, ఆయన కోలుకున్నారు.. తిరిగి సినిమాలు కూడా చేస్తున్నారు.


రాజశేఖర్..

rajasekhar

rajasekhar


హీరో రాజశేఖర్ విషయంలో కూడా ఇలాగే దుష్ప్రచారం జరిగింది. ఈ మధ్య కరోనా బారిన పడి, ఆసుపత్రిలో చేరిన రాజశేఖర్ ఆరోగ్యం విషయంలో మీడియా అత్యుత్సాహానికి అభిమానులు ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన కూడా కోలుకున్నారు. కొత్తగా సినిమాలు కూడా ఒప్పుకున్నారు. కరోనా కారణంగా తాత్కాలికంగా షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్న రాజశేఖర్ త్వరలోనే షూటింగ్ కి సిద్ధం కానున్నారు.


బండ్ల గణేష్

bandla ganesh

bandla ganesh


నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. మైల్డ్ హెల్త్ ఇష్యూతో ఆసుపత్రిలో చేరిన ఆయనను దాదాపు చంపేసినంత పని చేసింది మన ప్రియమైన మీడియా. కానీ, ఆయన కోలుకుని, మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు.
పైన పేర్కొన్న కొందరు నటులు, ఆ పగిలిపోయే వార్తల హెడ్ లైన్లు వచ్చినప్పుడు కాదుగానీ, ఆ తర్వాత.. కొందరు గంటల వ్యవధిలో చనిపోతే, మరికొందరు రోజుల వ్యవధిలో చనిపోయారు. కొందరు మాత్రం పూర్తిగా కోలుకున్నారు. సినిమా తారల గురించి ఏ వార్త అయినా ‘సేల్’ అవుతుందన్న కోణంలో న్యూస్ ఛానళ్ళు ఇలా పైత్యం ప్రదర్శించడం కామన్ అయిపోయింది.

Tags

Latest News

Related News